టాలీవుడ్ వివాదంపై రావు రమేశ్ సంచలన ట్వీట్లు.. అసలు నిజం ఇదే..

Sat May 30 2020 16:40:31 GMT+0530 (IST)

Rao Ramesh sensational tweets on Tollywood controversy

రావు రమేశ్.. ప్రఖ్యాత అలనాటి విలన్ రావు గోపాల్ రావు తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుపొందాడు.అయితే ఈ రోజు ఉదయం నుంచి రావు రమేశ్ పేరుతో ట్విట్టర్ లో వరుసగా ట్వీట్లు వెల్లువలా వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి గురించి.. మరికొన్ని చిత్ర పరిశ్రమ గురించి.. ఇటీవల అగ్రనటుడి వ్యాఖ్యలపై వరుసగా ట్వీట్లు పడ్డాయి. కలకలం రేపాయి. రావు రమేశ్ ఇలా మాట్లాడాడా అని చర్చనీయాంశమయ్యాయి. దీనిపై రావు రమేశ్ స్పందించాడు. ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తాను ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పై లేనని.. తన పేరును వాడుకొని కొందరు తప్పుడు ట్వీట్లు చేస్తూ తనను అభాసుపాలు చేస్తున్నారని.. వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇలాంటి హానికరమైన ఖాతాలను గుర్తించి తప్పుడు సమాచారం వ్యాపింపచేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ మేరకు ఈ ట్వీట్లు నావి కావని.. ఎవరూ నమ్మవద్దని పత్రికలకు ప్రకటన విడుదల చేశారు.