రణవీర్-దీపిక విడాకులు తీసుకుంటున్నారా?

Fri Sep 30 2022 17:00:00 GMT+0530 (India Standard Time)

Ranveer-Deepika getting divorced?

బాలీవుడ్ దంపతులు రణవీర్ సింగ్-దీపికా వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నారా?  నాలుగేళ్ల  వివాహ బంధానికి విడాకుల తో పుల్ స్టాప్ పెడుతున్నారా? ఆ రకమైన చర్యలకు జంట సిద్దమైందా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి.  ఈ జంట 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఆదర్శ దంపతులుగా వెలిగిపోయారు.ఎక్కడికి వెళ్లినా  జంటగా వెళ్లడం..రావడం వంటివి ఇద్దరి మధ్య అన్యోన్యతని తెలియజేసాయి. అలాంటి జంట విడిపోతుందంటూ బాలీవుడ్ లో ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి. దీపిక-రణవీర్ మధ్య మనస్పర్దలు తలెత్తాయని... కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారని తుదిగా  జంట విడాకుల తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇద్దరి మధ్య గ్యాప్ పెంచడానికి రణవీర్ న్యూడ్ ఫోటో షూట్ కూడా ఓ కారణంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్  ఫిలిం  క్రిటిక్ ఉమైర్ సందు కూడా విడాకుల వార్తని సమర్ధించారు. ఇద్దరి మధ్య రిలేషన్ చెడిందని.. త్వరలోనే విడాకుల ప్రకటన రానుందని ట్వీట్ చేయడం మరింత సంచలనంగా మారింది. అలాగే దీపిక వేలికి వివాహానికి ముందు  రణవీర్ తొడిగిన రింగు కూడా కనిపించలేదు.

దీపిక -తన తల్లి ఉజ్జల పదుకోణే ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు.  వాళ్లిద్దరి మధ్య రణవీర్ కనిపించలేదు. ఆయన తొడిగిన రింగు కనిపించలేదు. దీపిక వెంట తల్లి ఉండటం  ఈ కథనాలకి బలం చేకూర్చుందంటున్నారు.  దీంతో ఈ జంట అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకూ బాగానే ఉన్న జంటకి ఏమైందంటూ? కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత? అన్నది తెలియాలి.

ఇంత వరకూ దీపిక గానీ..రణవీర్ గానీ ఈ విషయం గురించి ఎక్కడా స్పందించలేదు. మరి ఇవి కట్టు కథనాలా?  వాస్తవాలా? అన్నది తేలాలంటే ఆ జంట లైన్ లోకి వస్తే గానీ క్లారిటీ రాదు. అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని..ఇద్దరం సంతోషంగా ఉన్నట్లు చెప్పకొచ్చారు. ఆరేళ్ల ప్రేమ...నాలుగేళ్ల ధాంపత్య జీవితంలో దీపిక పై  ప్రేమ పెరిగిందేగానీ..తరగ లేదని అన్నారు. ప్రస్తుతం బ్రేకప్ కథనాలు మీడియాలో హాట్ టాపి్ గా మారాయి. చర్చంతా రణవీర్..దీపిక గురించే నడుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.