స్టార్ కపుల్ మధ్య అంతా 'సరిగా' లేదట!

Thu Sep 29 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Ranveer Deepika Rumours Grow Stronger

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకునే మరియు యంగ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ల వివాహం 2018 నవంబర్ 14న జరిగిన విషయం తెల్సిందే. ఇంకా నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు. వీరి వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలో ఈ నాలుగు సంవత్సరాల్లో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. అందులో కొన్ని నిజం.. కొన్ని పుకార్లుగానే మిగిలి పోయాయి. కానీ ఇప్పుడు వస్తున్న పుకార్లు కాస్త టెన్షన్ ని క్రియేట్ ను చేస్తున్నాయి.ఇన్నాళ్ల కాలంలో రాని పుకార్లు మొదటి సారి ఇప్పుడే వస్తున్న నేపథ్యంలో కొంపదీసి నిజం కాదు కదా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు వస్తున్న పుకార్లు ఏంటీ అంటే... దీపిక పడుకునే మరియు రణ్వీర్ సింగ్ లు గత కొన్ని నెలలుగా సక్రమంగా ఉండటం లేదు. ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. ఆ దూరం విడాకుల వరకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ బాలీవుడ్ లో కొందరు చర్చించుకుంటున్నారు.

రణ్వీర్ సింగ్ మరియు దీపిక పడుకునే ల క్రేజ్.. స్టార్ డమ్ ల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ. యూనివర్శల్ గుర్తింపు ఉన్న దీపిక పడుకునే ఆదాయం విషయంలో కూడా ఆయన కంటే ఎక్కువే అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వస్తున్నాయి అనేది టాక్. అధికారికంగా అయితే క్లారిటీ రాలేదు.

మరో వైపు ఇటీవల రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ ను చేసిన విషయం తెల్సిందే. ఆ విషయంలో దీపిక టార్గెట్ అయ్యింది. చాలా మంది చాలా రకాలుగా ఆమె ని బ్యాడ్ గా ట్రోల్స్ చేశారు. దాని వల్ల ఆమె మనసు బాధ పడి అతడితో విభేదాలకు కారణం అయ్యింది అంటూ టాక్ వినిపిస్తుంది.

మొత్తానికి ఈ విషయంలో చాలా రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ అసలు విషయం అయితే క్లారిటీ రావడం లేదు. ఇద్దరు విడిపోయారు అనడానికి కొందరు సాక్ష్యాలు చూపిస్తూ ఉంటే.. కొందరు కలిసే ఉన్నారు అనడానికి సాక్ష్యాలు చూపిస్తున్నారు. అసలు విషయం ఏంటో కాలమే సమాధానం చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.