రంగమార్తాండ కోసం మిసెస్ ప్రకాష్ రాజ్

Mon Jan 17 2022 08:37:47 GMT+0530 (IST)

Rangamarthanda Movie Update

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగమార్తాండ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందనే వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలు నిజం కాదని తాజాగా షూటింగ్ చేయడం ద్వారా చిత్ర యూనిట్ సభ్యులు చెప్పకనే చెప్పారు. ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం.. రాహుల్ సిప్లిగంజ్.. శివాత్మిక.. ఇంకా పలువురు ప్రముఖ నటి నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఒక సూపర్ హిట్ సినిమాకు రంగమార్తాండ రీమేక్ అనే విషయం తెల్సిందే. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా పూర్తిగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా ను క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నట్లుగా దర్శకుడు కృష్ణవంశీ ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా ఈ సినిమాలోని ఒక పాట చిత్రీకరణ చేశారు. ఆ పాట లో చిత్రంలో నటిస్తున్న దాదాపు అందరు కీలక నటీ నటులు కూడా కనిపించబోతున్నారు. ఆ పాటకు సంబంధించిన షూటింగ్ గురించి దర్శకుడు కృష్ణవంశీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. కృష్ణవంశీ ఈ సినిమాలోని పాట కు ప్రకాష్ రాజ్ భార్య పోనీ ప్రకాష్ రాజ్ తో కొరియోగ్రఫీ చేయించినట్లుగా పేర్కొన్నాడు. ఇళయరాజా అద్బుతమైన పాటకు పోనీ ప్రకాష్ రాజ్ కొరియోగ్రఫీతో సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు.

మరాఠీ క్లాసిక్ మూవీ అయిన నటసామ్రాట్ కు రీమేక్ అయిన రంగమార్తాండ సినిమా లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే సాదక బాధకాల గురించి చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ మొదలు అయిన ఈ సినిమా పూర్తి అవ్వడం కోసం ఏకంగా మూడు ఏళ్లకు ఎక్కువ సమయం పట్టింది. కరోనా వల్ల మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. ఈ ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయాలని కోరుకుంటున్న అభిమానులకు కృష్ణవంశీ శుభవార్త తెలియజేశాడు. చివరి పాట చిత్రీకరణ చాలా స్పీడ్ గా పూర్తి అయ్యింది.

పోనీ ప్రకాష్ రాజ్ అద్బుత వర్క్ కారణంగా అనుకున్నదాని కంటే చాలా స్పీడ్ గా వర్క్ పూర్తి అయ్యిందని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నట్లుగా ఆయన చెప్పడంతో ఈ ఏడాదిలో సరైన సమయం సందర్బం చూసి విడుదల చేస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా పై శివాత్మిక రాజశేఖర్.. రాహుల్ సిప్లిగంజ్.. బ్రహ్మానందం.. అలీ రెజా ఇంకా పలువురు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా వారి యొక్క కెరీర్ ను ఎలాంటి టర్న్ తిప్పబోతుంది అనేది చూడాలి.