Begin typing your search above and press return to search.

విబేధాలు మ‌ర్చిపోయి అత‌నికి ఒకే చెబుతాడా?

By:  Tupaki Desk   |   29 Sep 2022 11:30 PM GMT
విబేధాలు మ‌ర్చిపోయి అత‌నికి ఒకే చెబుతాడా?
X
బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఉత్త‌రాది ప‌రిశ్ర‌మ‌లో గ్రేట్ డైరెక్ట‌ర్ గా కొన‌సాగుతున్నారు. భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు కేరాఫ్ ఆడ్ర‌స్ అయ‌న‌. దేవ‌దాస్..రామ్ లీల‌..బాజీరావ్ మ‌స్తానీ..ప‌ద్మావ‌త్ లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల్ని అందించిన ద‌ర్శ‌కుడు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ సినిమా అంటే భారీ బ‌డ్జెట్ చిత్రంగానే ప‌రిశ్ర‌మ భావిస్తుంది.

ప్ర‌స్తుతం ఈయ‌న 'హీరా మండీ' అనే వెబ్ సిరీస్ ని తెర‌కెక్కిస్తున్నారు. దీని త‌ర్వాత మ్యూజిక‌ల్ డ్రామా 'బైజు బావ్రా' ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. అయితే ఇందులో ఇద్ద‌రు హీరోలు అవ‌స‌రం. ఈ నేప‌థ్యంలో ఆ ఇద్ద‌ర్నీ ర‌ణ‌బీర్ క‌పూర్..ర‌ణ‌వీర్ సింగ్ అయితే బాగుంటుంద‌ని సంజ‌య్ భావిస్తున్నారు. ర‌ణ‌వీర్ నుంచి ఎలాంటి అభ్యంత‌రం లేదు.

ఇద్ద‌రి మ‌ధ్య మంచి ప్రెండ్ షిప్ ఉంది. అయితే స‌మ‌స్య‌ల్లా ర‌ణ‌బీర్ క‌పూర్ నుంచే క‌నిపిస్తుంది. ఆయ‌న ఎస్ చెబుతాడా? నో అంటారా? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. ర‌ణ‌బీర్ తొలి సినిమా 'సావారియా'కి సంజ‌య్ నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా సెట్ లో ఉండ‌గానే ఇద్ద‌రి మ‌ధ్య విబేదాలు త‌లెత్తాయి. దీంతో అప్పుడే మ‌ళ్లీ ఈ ద్వ‌యం క‌లిసి ప‌నిచేయ‌కూడ ద‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఇంత వ‌ర‌కూ అలా ఉంటూనే వ‌చ్చారు. అయితే ఈ విష‌యంలో సంజ‌య్ నే ఇప్పుడు వెన‌క్కి తగ్గి ర‌ణ‌బీర్ ని ఒప్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ర‌ణ‌వీర్ జోడీగా ర‌ణ‌బీర్ భార్య అలియాభ‌ట్ ని తీసుకోవాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్ అట‌. ఆ పాత్ర‌కు అలియా అయితేనే న్యాయ చేస్తుంద‌ని భావించి ఆమెతోనూ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారుట‌.

ఇప్ప‌టికే త‌న ఛాయిస్ గురించి సంజ‌య్ ర‌ణ‌బీర్ కి చెప్పారుట‌. కానీ ఆ యంగ్ హీరో నుంచి ఎలాంటి రిప్లై రాలేదుట‌. ఈ విష‌యంలో సంజ‌య్ చివ‌రికి అలియాభ‌ట్ స‌హాయం కూడా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తం గ‌త‌హా అన్ని మర్చిపోయి సినిమా చేద్దామ‌ని అలియా సైతం భ‌ర్త‌కి సూచించిద‌ట‌. కానీ ర‌ణ‌బీర్ అప్పుడు కూడా ఏం మాట్లాడ‌లేదుట‌.

దీంతో ర‌ణ‌బీర్ నిర్ణ‌యంపై ప్రాజెక్ట్ ఆధార‌ప‌డి ఉంద‌ని తెల‌స్తోంది. అలాగే ర‌ణ‌బీర్ కి జోడీగా కియారా అద్వాణీ ని అనుకుంటున్నారుట‌. ఆమె కూడా ఇంకా గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌లేదుట‌. ఏదేమైనా ప్రాజెక్ట్ ఇప్పుడు ర‌ణ‌బీర్ చేతుల్లోనే ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.

ఆయ‌న ఒకే చెబితే సంజ‌య్ వెంట‌నే పూర్తిచేయాల‌న్న ప్లాన్ లో ఉన్నారుట‌. లేక‌పోతే మ‌రో హీరోని ఛాయిస్ గా తీసుకోవాల్సి ఉంటుంద‌ని..అందుకు కొంచెం స‌మ‌యం ప‌డుతుంద‌ని బాలీవుడ్ వర్గాల స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.