లవ్ బర్డ్స్ పెళ్లికి ముందే హనీమూన్ ట్రిప్

Tue Jan 28 2020 07:00:04 GMT+0530 (IST)

Ranbir Kapoor and Alia Bhatt HoneyMoon Trip

అప్పటికే ఇద్దరు భామలతో ప్రేమాయణం సాగించి ఆ ఇద్దరికీ బ్రేకప్ చెప్పేశాడు. అయినా అతడితో ప్రేమలో పడింది కుర్రబ్యూటీ ఆలియా. ఈ జంట ప్రేమాయణానికి ఇరువైపులా పెద్దలు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. ఇక ఇన్నాళ్లు అటూ ఇటూ ఊగిసలాడిన లవర్ బోయ్ రణబీర్ సైతం ఎట్టి పరిస్థితిలో ఆలియాతో లైఫ్ లో సెటిలయ్యే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. అస్థిరత నుంచి బయటపడేందుకు యువహీరో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడన్నది అభిమానులు చెబుతున్న మాట. ఇక తన జీవితంలో దీపిక- కత్రినలతో బ్రేకప్ జరిగినట్టు ఆలియాతో అవ్వకుండా జాగ్రత్త పడతాడన్నదే అభిమానుల్లో హోప్.ఆశ నిరాశల మధ్య ఎట్టకేలకు ఈ జంట దంపతులు అవుతున్నారన్న చర్చా వేడెక్కిస్తోంది. 2020లోనే ఈ జంట పెళ్లి జరగనుంది. అందుకు ఇంకెంతో సమయం పట్టదని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఇంతలోనే ఈ వార్త ఖంగు తినిపిస్తోంది. ఆలూ లేదు సూలూ లేదు సోమలింగం అన్న చందంగా .. ఇంకా పెళ్లి పనులు అయినా మొదలెట్టక ముందే.. ఈ హాట్ పెయిర్ హనీమూన్ వెళ్లేందుకు ఎగ్జోటిక్ లొకేషన్ ని వెతుకుతున్నారట.

ఇప్పటికే స్విట్జర్లాండ్- బహామాస్- ఫిన్‌లాండ్ లోని మైండ్ బ్లో అనిపించే లొకేషన్స్ ని సెర్చ్ చేశారట.  విలాసవంతమైన ఎగ్జోటిక్ రిసార్ట్ లొకేషన్లలో ఫుల్ గా చిలౌట్ చేయలన్నది ప్లాన్ అని తెలుస్తోంది.  హనీమూన్ సరే కానీ.. కనీసం ఆ తర్వాత అయినా పెళ్లి ఉంటుందా ఉండదా? అన్నదానికి మాత్రం ఆ ఇద్దరి నుంచి సరైన క్లారిటీ లేనే లేదు.

ఇక కోడలు రాక ముందే కపూర్ ఫ్యామిలీలో గమ్మత్తయిన మార్పులేవో జరుగుతున్నాయి. రణబీర్ తల్లిదండ్రులు రిషి .. నీతూ కపూర్ లకు చెందిన ఐకానిక్ కృష్ణ రాజ్ భవంతి పునర్ నిర్మాణం సాగుతోంది. రణబీర్ -ఆలియా వివాహానంతర తొలి పూజ ఆ విలాసవంతమైన భవంతిలోనే జరుగుతుందని చెబుతున్నారు. ఇక 15 అంతస్తుల ఎత్తుకు ప్రత్యేకంగా మార్గం ఏర్పాటు చేసేందుకు కపూర్ ఫ్యామిలీ పాత బంగ్లాను పడగొట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ భవంతిని పడగొట్టి అక్కడ ఎత్తయిన నిర్మాణానికి గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నుండి అనుమతిని కోరారు. అక్కడ మేం నివశించం.. నివశించే సత్తా ఉన్నవాళ్లే నివసిస్తారు! అని కపూర్ పెద్దలు చెబుతున్నారు. అంటే అంత ఎత్తయిన భవంతిలో రణబీర్ - ఆలియా కాపురం పెడతారన్న హింట్ ఇచ్చారనే భావించాల్సి ఉంటుంది.