సంజూ భాయ్ కి ఇలా అవుతుందనుకోలేదన్న క్యూట్ కపుల్

Thu Aug 13 2020 17:19:17 GMT+0530 (IST)

Cute Couple Worried On Sanjay Health

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నారని.. వ్యాధి మూడో దశలో ఉందని ముంబై లీలావతి ఆస్పత్రి వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అమెరికాలో చికిత్స చేయించుకునేందుకు సంజూ భాయ్ సిద్ధమయ్యారు. అయితే ఈలోగానే ఆయనను ఇంటి వద్ద రణబీర్ కపూర్ - అలియా భట్ జంట సందర్శించారు.ఇటీవల సంజయ్ దత్ జీవితకథతో రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ బయోపిక్ `సంజూ`లో రణబీర్ టైటిల్ పాత్రను పోషించాడు. ఆ క్రమంలోనే రణబీర్ కి సంజయ్ తో అనుబంధం ఏర్పడింది. ప్రస్తుతం దత్ తో కలిసి రణబీర్ `షంషేరా`లో కనిపించనున్నారు. అలాగే `సడక్ 2` లో అలియా భట్ సంజయ్ దత్ తో కలిసి కనిపించనున్నారు. దత్ కి క్యాన్సర్ అని తెలియగానే ఆ ఇద్దరూ ఆందోళన చెందారు. తాజాగా సంజయ్ ఇంట్లో పరామర్శకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. రణబీర్ ఆలియా జంట సంజయ్ ఇంటి నుండి బయటకు వెళ్లి వారి కారు ఎక్కేప్పుడు క్యాజువల్ దుస్తుల్లో కనిపించారు.

శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో సంజయ్ ఇటీవల లీలవతి ఆసుపత్రిలో చేరారు. ఆయనను సోమవారం నాడు డిశ్చార్జ్ చేశారు. అతడికి కోవిడ్ -19 పరీక్షలు నిర్వహిస్తే నెగెటివ్ వచ్చిన సంగతి విధితమే. క్యాన్సర్ కి కీమో థెరపీ చికిత్స చేయించుకోనున్నారని తెలుస్తోంది. దీనికోసం అమెరికా వెళ్లాల్సి ఉండడంతో కొద్ది రోజుల పాటు విరామం తీసుకుంటున్నానని దత్ ప్రకటించారు. సంజయ్ దత్ నటించాల్సిన కేజీఎఫ్ 2 కీలక సన్నివేశాల చిత్రీకరణ పెండింగులో పడిన సంగతి తెలిసిందే.