వెంకీమామ కోసం ఫ్యామిలీ ప్రమోషన్

Fri Dec 06 2019 11:08:35 GMT+0530 (IST)

Rana's Conversation with Family

రియల్ మామా అల్లుళ్లు వెంకటేష్- నాగచైతన్య నటించిన `వెంకీ మామ` డిసెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తొలిసారి మామ-అల్లుడు కలిసి నటిస్తోన్న చిత్రం కావడంతో అక్కినేని ఫ్యాన్స్ పాటు.. వెంకటేష్ అభిమానులు ఎంతో క్యూరియస్ గా ఎదురు చూస్తున్నా రు. ఒకే ప్రేమ్ లో తమ అభిమాన హీరోలను చూడబోతున్నామంటూ రెట్టింపు ఉత్సాహాంతో వేచి చేస్తున్నారు. రిలీజ్ కి మరో ఆరు రోజులే సమయం మిగిలి ఉంది. దీంతో ఈ ఆరు రోజులు క్షణం తీరిక అయినా లేకుండా వెంకీ-రానా-చైతన్య బృందం బిజీ బిజీగా మీడియా ఇంటరాక్షన్స్ తో కిక్కివ్వబోతున్నారట. అయితే అంతకు ముందే ఈ మామ-అల్లుడు ఓ ప్రత్యేక ఇంటర్వ్వూతో అభిమానుల్లో జోష్ నింపబోతున్నారు. అందుకు దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది.వెంకీమామ కోసం.. సురేష్ బాబు కోసం.. బాబాయ్ వెంకటేష్ కోసం బావ చైతన్య కోసం రానా చేస్తున్న క్రియేటివ్ ప్రమోషన్ చూస్తుంటే ముచ్చటగొలుపుతోంది. మొన్నటికి మొన్న రిలీజ్ తేదీ చెప్పవూ! అంటూ బాబీని ప్రశ్నించిన వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా రానా యాంకర్ అవతారం ఎత్తి కుటుంబ సభ్యులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి పబ్లిసిటీ కోసం ప్రత్యేక ఇంటర్వూ చేశాడు. ఆ అభిభాషణకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియా లో జోరుగా వైరల్ అవుతోంది. పూర్తి ఇంటర్వ్యూ అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ నింపడం ఖాయం. ఆ ఇంటర్వూలో రానా కొలీగ్ హీరోలు వెంకీ-చైతన్యలతో పాటు నిర్మాత సురేష్ బాబుపై ఎలాంటి ప్రశ్నలు సంధించాడు? వాటికి వెంకటేష్-చై- సురేష్ బాబు ఎలాంటి సమాధానిలిచ్చారు? అన్న ఆసక్తి నెలకొంది. ఆ ఇంటర్వూ వీడియో ఎప్పుడు ప్రసారం అవుతుందన్నది ఇంకా రివీల్ చేయలేదు. అభిమానులు పదే పదే సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నా.. రానా మాత్రం సస్పెన్స్ లో ఉంచాడు. చెప్పుకోండి చూద్దాం! అన్నట్లుగా క్యూరియాసిటీ ని రెట్టింపు చేస్తున్నాడు. ఆ క్షణం కోసమే తాను కూడా ఎంతో ఎగ్జైటింగ్ ఎదురుచూస్తున్నామని తెలిపాడు. సినిమా రిలీజ్ కు ఇంకా ఆరు రోజులే సమయం ఉంది. కాబట్టి ఈ గ్యాప్ లోనే ఆ వీడియో ఇంటర్వూ బయటకు రానుంది.

ఇకపోతే వెంకీ-చైతూ కలిసి నటించినా ఆ ఇద్దరితో పాటు రానా కూడా కలిసి నటిస్తే చూడాలన్న కోరిక అభిమానులకు ఎప్పటికి నెరవేరుతుందో? నాయుడుగారు ఉన్నన్నాళ్లు వెంకీ-రానాలను కలిపి ఓ సినిమా చేయాలని అందులో తన పెద్ద కుమారుడు సురేష్ బాబు.. చిన్న మనవడు అభిరామ్.. వాళ్లతో పాటు తాను కూడా నటించాలని అనుకున్నారు. కానీ ఆ కల నెరవేరక ముందే ఆయన స్వర్గస్తులయ్యారు. అందుకే దగ్గుబాటి హీరోలంతా ఒకే ఫ్రేములోకి వచ్చేప్పటికి ఫ్యాన్స్ ఇంకా కొత్తగా ఊహిస్తున్నారు మరి. ఆ ఊహకు దగ్గుబాటి ఫ్యామిలీ నిజరూపం ఇచ్చేదెప్పుడో చూడాలి. ఇక అసురన్ రీమేక్ లో వెంకీతో పాటు రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ నటిస్తాడన్న ప్రచారం ఇటీవల వేడెక్కిస్తోంది.