రానా అమెరికా పర్యటన దేనికోసం..?

Sun Aug 01 2021 10:05:48 GMT+0530 (IST)

Rana on a tour of America

టాలీవుడ్ యంగ్ హీరో రానా అమెరికా వెళ్లారు. అయితే ఈ ఆకస్మిక పర్యటన దేనికోసం? అంటూ అభిమానుల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం అతడు సాగర్ చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్ కోషియం` రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కల్యాణ్ తో పాటు రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు పెండింగ్ లో ఉన్న `విరాఠపర్వం` చిత్రాన్ని రిలీజ్ చేయాల్సిన సందర్భమిది. ఇలాంటి సమయంలో సడెన్ గా రానా అమెరికా ఎందుకు వెళ్లారు? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది.ఏదైనా షూటింగ్ షెడ్యూలా? లేదూ ఏదైనా వ్యక్తిగత పని మీద వెళ్లారా? అంటూ అభిమానులు అడుగుతున్నారు. అయ్యప్పనుమ్ కోషియం పెండింగ్ సన్నివేశాలు చిత్రీకరించకుండా హడావుడిగా ఎందుకు ఈ ప్రయాణం? అంటూ ప్రశ్నిస్తున్నారు.

2020 లో తన స్నేహితురాలు మిహీకా బజాజ్ ని రానా వివాహం చేసుకున్నారు. ఈ జంట అన్యోన్య దాంపత్యం సాగిస్తోంది. పెళ్లి తర్వాత తన జీవితం మంచిగా మారిందని రానా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం కెరీర్ పై పూర్తిగా శ్రద్ధ పెట్టానని తెలిపారు. తన భార్య అన్నిటినీ సరిగా తీర్చిదిద్దుతోందని రానా వెల్లడించారు. అయితే రానా పెళ్లికి ముందు అనారోగ్యానికి చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. మళ్లీ ఇప్పుడు ఆకస్మికంగా దేనికి వెళ్లారు అన్నదానికి సమాధానం రావాల్సి ఉంది. అతడు ట్రీట్ మెంట్ కోసమే షార్ట్ ట్రిప్ వెళ్లారా? అన్నది స్వయంగా ధృవీకరించాల్సి ఉంది.