రానా లేడీ లవ్ మిహీక ఏం చేసిందంటే!

Tue Jul 07 2020 10:45:18 GMT+0530 (IST)

Rana fiancee Miheeka displays her wedding jootis

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి పెళ్లి మూడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సహచర హీరోలు అదే మూడ్ ని కంటిన్యూ చేస్తూ మహమ్మారీ లాక్ డౌన్ ని కూడా పట్టించుకోకుండా పెళ్లాడేస్తున్నారు. ఇక ఇదే హుషారులో రానా తాను ప్రేమించిన మిహీక మెడలో మూడు ముళ్లు వేసేందుకు రెడీ అవుతున్నాడు.ఆగస్టు 8 న తన లేడీ లవ్ మిహీకా బజాజ్ తో ముహూర్తం ఫిక్సవ్వడంతో ఆ ఏర్పాట్లతో బిజీగా ఉన్నాడు. కరోనావైరస్ భయాల మధ్య రకరకాల కండీషన్స్ నడుమ వివాహం సాధారణ వ్యవహారంగా మారింది.  అయినా ఏమాత్రం నిరుత్సాహపడక దగ్గుబాటి ఫ్యామిలీ సహా పెళ్లికూతురు తరపు వాళ్లు పెళ్లి వేడుక పనుల్లో బిజీ అయ్యారు.

మిహీకా ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా తన పెళ్లి జూటిస్ ఫోటోని పంచుకుంది. దగ్గుబాటి అల్లుడు పెళ్లి రోజున చక్కగా డిజైన్ చేసిన ఎంబ్రాయిడరీ ఫిజ్జీ గోబ్లెట్ జూటిస్ ధరించనున్నారు. ఈ వివాహం హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో జరుగుతుంది. ఈ వేడుకకు కొద్దిమంది బంధుమిత్రులు .. సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.