రానా మళ్లీ ఇంకోటి ప్రకటించాడు

Fri Oct 15 2021 21:00:01 GMT+0530 (IST)

Rana announces another one again

యంగ్ హీరో రానా ఆమద్య అనారోగ్య సమస్యల కారణంగా ఏడాది పాటు సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చాడు. మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్న సమయంలో కరోనా వల్ల ఆయన సినిమాలు ఎక్కువ లేకుండా అయ్యాయి. కరోనా కారణంగా వచ్చిన బ్రేక్ ను కవర్ చేసేందుకు గాను రానా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కమిట్ అయ్యాడు. సినిమా లో మాత్రమే కాకుండా ఆయన వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు కూడా సిద్దం అయ్యాడు. ఇప్పటికే బాబాయి వెంకటేష్ తో కలిసి వెబ్ సిరీస్ ను చేస్తున్నాడు. ఆ వెబ్ సిరీస్ ను మొదలు పెట్టడం కూడా జరిగింది.ఒక వైపు తన విరాటపర్వం సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. మరో వైపు పవన్ కళ్యాణ్ తో కలిసి 'భీమ్లా నాయక్' సినిమాను కూడా చేస్తున్న విషయం తెల్సిందే. ఇవి మాత్రమే కాకుండా ఇప్పటికే రెండు మూడు సినిమాలు కూడా ఆయన కమిట్ అయ్యాడు. ఇదే సమయంలో ఆయన కొత్త సినిమా ప్రకటన వచ్చింది. దసరా సందర్బంగా రానా కొత్త సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు మిలింద్ రావ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమాను రానా చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈ విషయాన్ని అఫిషియల్ గా ప్రకటించాడు.

రానా ఒక వైపు టాక్ షో లు చేస్తూ మరో వైపు హీరోగా సినిమాలు చేస్తూ.. మరో వైపు విలన్ గా నటిస్తూ ఇంకో వైపు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ కెరీర్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో మిలింద్ రావ్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు కమిట్ అవ్వడం విశేషం. ఈ సినిమాను హిందీ తెలుగు మరియు తమిళంలో రూపొందించబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందబోతున్న ఈ సినిమాను స్పిరిట్ మీడియా నిర్మించబోతుంది. విశ్వశాంతి పిక్చర్స్ వారు ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయ్యేది.. ఇతర విషయాల గురించి త్వరలో మరింత క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.