Begin typing your search above and press return to search.

ల‌గేజ్ మిస్సింగ్.. ఎయిర్ లైన్స్ పై రానా ఫైర్!

By:  Tupaki Desk   |   4 Dec 2022 2:53 PM GMT
ల‌గేజ్ మిస్సింగ్.. ఎయిర్ లైన్స్ పై రానా ఫైర్!
X
టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోల్లో రానా ద‌గ్గుబాటి ఒక‌రు. ఇటీవ‌లే వెడ్ లాక్ తో అత‌డి లైఫ్ లో స‌రికొత్త ఆనంద‌క్ష‌ణాల‌ను ఆస్వాధిస్తున్నాడు. ఇటీవ‌లే గోవాలో జ‌రిగిన ఇఫీ వేడుక‌ల‌కు రానా అటెండ‌య్యారు. అయితే అత‌డికి విమాన‌యాన సంస్థ‌తో పెద్ద చిక్కొచ్చి ప‌డింది. రానా దగ్గుబాటి ఇటీవల ప్ర‌ముఖ ప్ర‌యివేట్ ఎయిర్‌లైన్స్ లో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. త‌న ల‌గేజ్ ని కోల్పోయాన‌ని వారి ద‌గ్గ‌ర స‌మాధానం లేద‌ని తీవ్రంగా విరుచుకుప‌డుతూ సోష‌ల్ మీడియాల్లో సందేశం అందించారు.

రానా దగ్గుబాటి తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఇండిగో ఎయిర్‌లైన్స్ ను వ‌రుస పోస్ట్ లలో విమర్శించారు. విమానయాన సంస్థ gif చిత్రాన్ని షేర్ చేస్తూ..ఘాటైన విమ‌ర్శ‌లు చేసారు. ``భారతదేశంలో అత్యంత చెత్త ఎయిర్ లైన్ అనుభవం @IndiGo6E !! విమాన ప్ర‌యాణ‌ సమయాలు క్లూలెస్... తప్పిపోయిన సామాను ట్రాక్ చేయలేరు... సిబ్బందికి ఎలాంటి క్లూ లేదు. అది మరీ ఇంత దారుణ‌మా?`` అని రానా ఫైర‌య్యారు.

ఈ విషయాన్ని అత‌డు తేలికగా తీసుకోలేదు. స‌ద‌రు ఎయిర్ లైన్స్ పై తనవైన‌ వ్యంగ్య ప్రత్యుత్తరాలతో కంపెనీ పోస్ట్ ల‌ను రీట్వీట్ చేసాడు. ``మా ఇంజనీర్లు నిపుణులు... ప్రతిరోజూ నాన్ స్టాప్ జ‌ర్నీలో సురక్షితమైన అవాంతరాలు లేని ప్ర‌యాణాలను అందిస్తారు`` అనే కోట్ ని షేర్ చేస్తూ... ``బహుశా ఇంజనీర్లు మంచి సిబ్బంది కావచ్చు! మీరు సరిగ్గా ప‌ని చేయవలసి ఉంటుంది`` అని సెటైర్ వేసాడు. మరొక పోస్ట్ కి స‌మాధానంగా ``ఆస్వాధించే దానికంటే కోల్పోయే స్వర్గమే ఎక్కువ‌`` అని సెటైర్ వేసాడు.

మరో ప్రమోషనల్ పోస్ట్ లో రానా ఇలా రాసాడు. ``ఇండిగో విమానాలు ఎప్పుడైనా షెడ్యూల్ ప్ర‌కారం దిగకపోవచ్చు లేదా టేకాఫ్ కాకపోవచ్చు!! - మ‌నం ల‌గేజ్ గురించి అడిగితే వారికి ఎలాంటి క్లూ ఉండదు`` అని విమ‌ర్శించాడు. దీనిని బ‌ట్టి రానాకు ఎదురైన ఇబ్బంది అంతా ఇంతా కాద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ విషయంపై కంపెనీ ఇంకా స్పందించాల్సి ఉంది.

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ... విమాన‌యాన సంస్థ‌పై అత‌డి ఘాటైన విమ‌ర్శ‌లు అభిమానుల్లో వైర‌ల్ గా మారాయి. ఇటీవల 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) కోసం గోవాను సందర్శించిన క్ర‌మంలో అత‌డు దీనిని ఫేస్ చేసాడ‌ని భావిస్తున్నారు.

ఫిల్మ్ ఫెస్టివల్స్ స్వతంత్ర చిత్రాలకు అనుకూల‌ వ్యవస్థగా మారాయి. స్వతంత్ర స్వరాలు స్వేచ్ఛ‌గా ఎవ‌రికి వారు తాముగా ప్రదర్శించుకోవడానికి అద్భుత‌ పండుగ ఇది. గోవాలో ఉండటం చాలా గొప్పగా అనిపిస్తుంది... అని ఇంత‌కుముందు మీడియాతో అన్నారు రానా. IFFI ముగింపు వేడుకకు ఆశా పరేఖ్- ఆయుష్మాన్ ఖురానా- మానుషి చిల్లర్ - ఈషా గుప్తా- ఆనంద్ రాయ్ త‌దిత‌ర‌ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

రానా దగ్గుబాటి చివరిసారిగా తెలుగులో పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ చిత్రంలో కనిపించాడు. ఇది మలయాళ చిత్రం అయ్యపనుం కోషియుమ్ కి రీమేక్. నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్న రానా నాయుడులో బాబాయ్ వెంక‌టేష్ తో క‌లిసి ఆస‌క్తిక‌ర‌ పాత్రను పోషిస్తున్నాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.