యాంకర్ ఓవరాక్షన్ కు రానా పర్ఫెక్ట్ కౌంటర్

Sat Jun 22 2019 10:57:16 GMT+0530 (IST)

ఈ మధ్య నార్త్ మేకర్స్ లో కానీ మీడియాలోని కొన్ని వర్గాల్లో కానీ సౌత్ సినిమాల మీదున్న చులకన అభిప్రాయం అప్పుడప్పుడు వాళ్ళ మాటల్లో బయటపడుతూనే ఉంటుంది. బాహుబలి కనివిని ఎరుగని స్థాయిలో ఆల్ ఇండియా రికార్డులు సాధించాక దాన్ని మనసారా ఒప్పుకోవడానికి సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్లకు ఈగో అడ్డం వచ్చి  కనీసం ఆ సినిమా చూడలేదని పదే పదే చెప్పడం అందరికి గుర్తే.అవకాశం రావాలే కానీ మనవాళ్ళూ దానికి ధీటైన సమాధానం ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. రానాకు ఆ ఛాన్స్ దొరికింది. ఇటీవలే ఓ వెబ్ ఛానల్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా అందులో యాంకర్ చేసిన కామెంట్ కి తనదైన శైలి సూపర్ కౌంటర్ ఇచ్చే సారికి నోరు విప్పి మాట్లాడలేని స్థితికి ఆ అమ్మాయి వచ్చేసింది

డీటెయిల్స్ లోకి వెళ్తే సౌత్ సినిమాలన్ని ఒకరకమైన స్టీరియో టైపులో ఉంటాయని బాహుబలి చూసాక అటు వైపు మార్పు వచ్చిందని మీకెలా అనిపించిందంటూ సదరు యాంకర్ రానాను అడిగింది. దీనికి బదులిస్తూ అసలు భారతీయులు పక్క రాష్ట్రాల సినిమాలను ఇలాంటి అభిప్రాయంతో చూస్తారని నేననుకొనని కెమెరా ముందుకు వచ్చాక అందరు ఒకటే అని అవెంజర్స్ నుంచి రజనీకాంత్ మూవీస్ దాకా బాషా సరిహద్దులు లేకుండా అవి అన్ని చోట్ల ఆదరణ పొందుతున్నాయని అంతే తప్ప మీరు అన్నట్టు ఎక్కడా హద్దులు గీతలు లేవని కుండ బద్దలు కొట్టేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.