Begin typing your search above and press return to search.

నిన్న మన్మధుడు.. నేడు భల్లాలదేవుడు ఒకే రికార్డు!

By:  Tupaki Desk   |   18 Jun 2020 9:30 AM GMT
నిన్న మన్మధుడు.. నేడు భల్లాలదేవుడు ఒకే రికార్డు!
X
సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక సెలబ్రెటీలు తమ అభిమానులకు దగ్గరవడానికి గొప్ప మార్గంలా కనిపిస్తుంది. వ్యక్తిగత విషయాలతో పాటు తమ సినిమాలకు సంబందించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఫాలోయర్లను పెంచుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికీ తెలసిందే. తన అభిప్రాయాలను, సినిమా విశేషాలను ఫ్యాన్స్.. ఫాలోవర్లతో ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఉంటారు. అయితే గత పదేళ్లుగా నాగార్జున ట్విట్టర్ అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇన్నేళ్ళలో నాగార్జున ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తాజాగా నాగార్జున ఓ అరుదైన రికార్డు నమోదు చేశారు. ఇటీవలే కింగ్ నాగార్జున 6 మిలియన్ల ఫాలోవర్ల మార్క్ సాధించారు. అయితే ఈ రికార్డును మరో టాలీవుడ్ హీరో కూడా సాధించాడు.

అతనెవరో కాదు దగ్గుబాటి రానా. తెలుగులో 6 మిలియన్ ఫాలోవర్ల మార్క్‌ను దాటిన టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా తక్కువ. ఇక హీరోలలో 9.8 మిలియన్ ఫాలోవర్స్‌తో సూపర్ స్టార్ మహేష్ బాబు అగ్రస్థానంలో ఉన్నాడు. రానా కూడా ఇటీవలే 6 మిలియన్ ఫాలోవర్లను పొందాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు అభిమానులు.. కింగ్ నాగార్జున, రానాలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరి తర్వాత ట్విట్టర్లో దర్శకధీరుడు రాజమౌళి 5 మిలియన్ల ఫాలోయర్లను కలిగి ఉన్నాడు. టాలీవుడ్లో మిగిలిన స్టార్ హీరోలకు కూడా 5 మిలియన్ ఫాలోవర్స్ లేకపోవడం గమనార్హం. ఇక సీనియర్ హీరోల విషయానికి వస్తే నాగార్జునదే అగ్రస్థానం. మొత్తానికి మన్మథుడు సోషల్ మీడియాలో హవా కొనసాగిస్తున్నాడనే చెప్పాలి. ఇక నాగార్జునతో పాటు రానా కూడా అదే వరుసలో చేరాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటిస్తున్నారు. రానా అరణ్య.. విరాటపర్వం సినిమాలతో బిజీగా ఉన్నాడు.