దగ్గుబాటి వర్సెస్ దగ్గుబాటి.. దుమ్ము దులిపేశారు!

Sat Sep 24 2022 12:41:04 GMT+0530 (India Standard Time)

Rana Naidu Official Teaser

విక్టరీ వెంకటేష్ రానా దగ్గుబాటి ఇద్దరూ బాబాయ్ అబ్బాయ్ అన్న విషయం తెలిసిందే. తొలి సారి ఈ ఇద్దరూ కలిసి ప్రముఖ పాపులర్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ కోసం సై అంటే సై అంటూ రంగంలోకి దిగారు. ఈ ఇద్దరు కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లింగ్ డ్రామా 'రానా నాయుడు'. కరణ్ అన్షుమన్ సుపర్ణ్ ఎస్. వర్మ సంయుక్తంగా ఈ వెబ్ యాక్షన్ డ్రామాని రూపొందించారు. అమెరికన్ సిరీస్ 'రే డొనోవన్' అడాప్ట్ చేసుకుని ఈ సిరీస్ ని ఇండియన్ నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి తెరపైకి తీసుకొచ్చారు.ముంబై హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్ ని రూపొందించారు. విక్టరీ వెంకటేష్ మునుపెన్నడూ కనిపించని విధంగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారు. రానా అతనికి ఎదురెళ్లే పవర్ ఫుల్ పాత్రలో నటించాడు. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ యాక్షన్ థ్రిల్లర్ త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో శనివారం గ్లింప్స్ పేరుతో నెట్ ఫ్లిక్స్ టీజర్ ని విడుదల చేసింది.

హిందీలో రూపొందిన ఈ సీరీస్ టీజర్ టెర్రిఫిక్ గా వుంది. దగ్గుబాటి వర్సెస్ దగ్గుబాటి అంటూ నెట్ ఫ్లిక్స్ షేర్ చేసిన టీజర్ ఇంటెన్స్ డ్రామాగా వుండనున్నట్టుగా తెలుస్తోంది. గత కొంత కాలంగా ఈ సిరీస్ కోసం దగ్గుబాటి ఫ్యాన్స్ తో పాటు ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రానా నాయుడుగా రానా నాగ పాత్రలో విక్టరీ వెంకటేష్ పోటీ పోటీగా నటించారు.

సెలబ్రిటీలకు గ్యాంగ్ స్టర్లతో సమస్యలు తలెత్తితే రానా ముఖానికి మాస్క్ ధరించి క్రికెట్ బ్యాట్ తో రంగంలోకి దిగడం.. విచక్షణా రహితంగా క్రికెట్ బ్యాట్ తో హత్య చేయడం రానా స్పెషాలిటి.. అలాంటి రానాని కొట్టాలంటే నాగనే కరెక్ట్ అని గ్యాంగ్ స్టర్స్ నమ్ముతుంటారు. రానా నాగ విడిపోయిన తండ్రీ కొడుకులు.. ఈ ఇద్దరి మధ్య సాగే వైరం నేపథ్యంలో హార్ట్ కోర్ సన్నివేశాలతో ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సిరీస్ ని ఆత్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు.

విజువల్స్ చాలా కృయలుగా వున్నాయి. టీజర్ మధ్యలో 'నానా నహీ బోలేగా మేరోకో... బాపు తెరా..(నాన్న అనిపిలవవా? నన్ను.. నీ నాన్నని నేను) అని వెంకటేష్ అడుగుతుంటే .. బాప్ జైసా కామ్ కరేతో తబ్ బోల్తా (నాన్నలాగ పనులు చేస్తే అప్పుడు నిన్ను నాన్న అని పిలుస్తా) అని రానా అంటున్న తీరు ఇద్దరి మధ్య ఏ స్థాయిలో హోరా హోరీ వైరం వుంటుందన్నది స్పష్టం అవుతోంది.

టీజర్ ఎండింగ్ లో వెంకటేష్ ని పట్టుకుని పాయింట్ బ్లాంక్ లో రానా గన్ పెట్టి బెదిరిస్తున్న తీరు అతని క్యారెక్టర్ ని ఎంత పవర్ ఫుల్ గా టఫ్ గా మలిచారో అర్థమవుతోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.