Begin typing your search above and press return to search.

రానా మ‌రో ప్రామిస్సింగ్ ఎటెంప్ట్

By:  Tupaki Desk   |   23 Jan 2020 8:46 AM GMT
రానా మ‌రో ప్రామిస్సింగ్ ఎటెంప్ట్
X
యంగ్ హీరో రానా వ‌రుస‌గా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల‌కు.. పాన్ ఇండియా కేటగిరీలో యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న క‌థాంశాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్న సంగ‌తి తెలిసిందే. హాథీ మేరా సాథీ- హిర‌ణ్య‌క‌శిప ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాలే. భారీ కాన్వాసుపై తెర‌కెక్కించి ఈ సినిమాల్ని ప‌లు భాష‌ల్లో ఏక‌కాలంలో రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. హిందీ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రానా క‌థ‌ల‌ సెల‌క్ష‌న్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

హాథీ మేరా సాథీ నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నా దానికి సంబంధించిన‌ తాజా అప్ డేట్ రాలేదింకా. హిర‌ణ్య‌క‌శిప వ‌చ్చే స‌మ్మర్ లో ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం విరాఠ‌పర్వం సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఒక‌టి సెట్స్ పై ఉండ‌గానే మ‌రో మూడు నాలుగు సినిమాల‌పైనా వ‌ర్క్ చేస్తూ రానా క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు.

ట్యాలెంటెడ్ రానా ఒక‌దాని వెంట ఒక‌టిగా క‌థ‌ల్ని లాక్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు తేజ వినిపించిన క‌థ‌ను లాక్ చేశాడ‌ని తెలిసింది. నేనే రాజు నేనే మంత్రి త‌ర్వాత ఈ క్రేజీ కాంబినేష‌న్ లో మ‌రో ఆస‌క్తిక‌ర సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో రానా ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ట‌. అంతేకాదు ఇందులో ఓ యువ‌హీరో క‌థానాయ‌కుడిగా న‌టిస్తారు. రాక్ష‌స రాజ్యంలో రావ‌ణాసురుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. విరాట‌ప‌ర్వం చిత్రీక‌ర‌ణ పూర్త‌వ్వ‌గానే హిర‌ణ్య‌క‌సిప మొద‌ల‌వుతుంది. అటుపై తేజ‌తో సినిమా మొద‌లు పెట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.