Begin typing your search above and press return to search.

'హౌస్ ఫుల్ 4' లో రానా గెట‌ప్ ఇదే

By:  Tupaki Desk   |   22 Oct 2019 5:08 AM GMT
హౌస్ ఫుల్ 4 లో రానా గెట‌ప్ ఇదే
X
ఇటీవ‌ల గూగుల్ ట్రెండింగ్ లో హాట్ టాపిక్ అయ్యాడు ద‌గ్గుబాటి రానా. అత‌డి ఆరోగ్యం గురించి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అయితే విదేశాల్లో శ‌స్త్ర చికిత్స త‌ర్వాత రానా ఆరోగ్యంగానే ఉన్నారు. ఇటీవ‌ల అభిమానుల‌కు ఈ విష‌యంపై పూర్తి క్లారిటీని ఇచ్చారు. కంటికి సంబంధించిన ఆప‌రేష‌న్ చేయించుకున్నాన‌ని రానా వివ‌ర‌ణ ఇచ్చారు. ఇక త‌దుప‌రి వ‌రుస‌గా తాను న‌టించే సినిమాల‌పైనా దృష్టి సారిస్తున్నాన‌ని అన్నారు.

రానా క్యూలో ఇప్ప‌టికే ప‌లు భారీ చిత్రాలు ఉన్నాయి. అత‌డు న‌టించిన తాజా చిత్రం `హౌస్ ఫుల్ 4` ఈనెల 26న రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా అతడు సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ చిత్రంలో అక్ష‌య్- బాబి డియోల్- రితేష్- పూజా హెగ్డే-కృతి స‌నోన్ లాంటి స్టార్ల‌తో పాటుగా రానా కీల‌క పాత్ర‌లో న‌టించాడు. అత‌డు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టించాడు. ఇప్ప‌టికే ట్రైల‌ర్ లో రానా గెట‌ప్ రివీలైంది. దీనికి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రంలో రానా రెండు షెడ్స్ లో క‌నిపించ‌నున్నాడు. `కూకా టోలీ కా రాజా` .. `ప‌ప్పు రంగీలా` అనే రెండు ర‌కాల గెట‌ప్పుల్లో మెస్మ‌రైజ్ చేయ‌బోతున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి త‌న‌ గెట‌ప్ కు సంబంధించిన మోష‌న్ పోస్టర్ ని రానా ఇన్ స్టా గ్ర‌మ్ లో షేర్ చేశారు. ``నేనే టోలీ కా రాజా.. నేనే ప‌ప్పు రంగీలా కూడా. ఈనెల 26న మీ ముందుకు వ‌స్తున్నాను...`` అని తెలిపాడు. గెట‌ప్ ఆక‌ట్టుకుంది. రానా భీక‌ర మాంత్రికుడిలా క‌నిపిస్తున్నాడు. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో కన్ఫ్యూజ‌న్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. రానా గెట‌ప్పులు భీక‌రంగానే ఉన్నాయి. ఒక ర‌కంగా భ‌ళ్లాల‌దేవుడే కాళ‌కేయుడైతే అన్న‌ట్టుగా విచిత్ర‌మైన ఆహార్యాన్ని సెట్ చేసిన‌ కొన‌సాగింపు పాత్ర‌ల్లా విచిత్రంగానే ఉన్నాయి. పేర్లు చిత్రం.. పాత్ర‌లు విచిత్రం! అన్న‌ట్టుగానే చూపిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. తోడేలుతో అతడి పోరాటం కూడా ఇందులో హైలైట్ గా నిల‌వ‌నుంద‌ని ట్రైల‌ర్ తో పాటు పోస్ట‌ర్ల‌లో రివీల్ చేశారు. మ‌రో మూడు రోజుల్లోనే హౌస్ ఫుల్ 4 సంగ‌తేంటో తేల‌నుంది. నేరుగా థియేట‌ర్ల‌లో చూసి ప్రేక్ష‌కులే రివ్యూలు చెప్ప‌నున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి