రానా బర్త్ డే నుంచి మొదలు పెడతాడా?

Thu Dec 05 2019 18:55:22 GMT+0530 (IST)

Rana Daggubati wraps up Haathi Mere Saathi

రానా కథానాయకుడిగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో `హాతీ మేరా సాతీ` అనే భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు- హిందీ- తమిళం-హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  ఈసినిమా ప్రారంభమై చాలా కాలమే అయ్యింది. అయితే మధ్యలో ఏమైందో ఈ సినిమా  షూటింగుకి సంబంధించిన ఏ అప్ డేట్ రివీల్ చేయలేదు. `ఘాజీ` తరహాలో ఈ సినిమా విషయంలోనూ రానా అన్ని విషయాలు సీక్రెట్ గా ఉంచాడు.  దీంతో మీడియాలో రకరకాల సందిగ్ధతలు నెలకొన్నాయి.ఈ క్రేజీ మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 14న రానా పుట్టిన రోజు సందర్భంగా అన్ని భాషల్లోనూ  ప్రచారం పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నారట. టీజర్- ట్రైలర్- ఆడియో ఇలా ఒక్కో వేదికను ప్రచార రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని నిర్మాతలు గట్టిగా ప్లాన్ చేస్తున్నారుట. సినిమా రిలీజ్ తేదీని కూడా బర్త్  డే రోజున రివీల్ చేయనున్నారని సమాచారం అందుతోంది.

ఇందులో రానా సరసన జోయా హుస్సేన్ నటిస్తోంది. రానా ఇందులో బందేవ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఒకసారి నాలుగు భాషల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో ఆయా భాషల నటులను  ఎంపిక చేసి తెరకెక్కిస్తున్నారు. ఆనంద్.ఎల్. రాయ్ మరో ముగ్గురు నిర్మాతలతో కలిసి డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   గతంలో రాజేష్ ఖన్నా ఇదే టైటిల్ తో నటించిన క్లాసిక్ సినిమాకి రీమేక్  అని ప్రచారం జరిగినా ఇది పూర్తి కొత్తగా ఉంటుందని రానా తెలిపారు. ఎనుగులతో మనిషి అనుబంధం.. అడవి నేపథ్యంలో పోలిక మాత్రం ఉంటుందని రానా వివరణ ఇచ్చారు.