Begin typing your search above and press return to search.

రానా స్టార్ కాదు.. అత‌నో స్టూడెంట్

By:  Tupaki Desk   |   6 Dec 2019 7:07 AM GMT
రానా స్టార్ కాదు.. అత‌నో స్టూడెంట్
X
డైన‌మిక్ స్టార్ రానా తొలి త్రిభాషా చిత్రం `హాతీ మేరా సాథి`. ఇందులో రానా స‌ర‌స‌న శ్రీయ‌ పిల్ గోవాంక‌ర్ న‌టిస్తోంది. తెలుగు-త‌మిళ‌- హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని ప్ర‌భుసాల్మ‌న్ తెర‌కెక్కిస్తున్నారు. ఆనంద్ ఎల్. రాయ్- సురేష్ బాబు స‌హా మ‌రో ముగ్గురు నిర్మాత‌ల భాగ‌స్వామ్యంలో ఈ సినిమా అత్యంత భారీగా తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్త‌యింది. డిసెంబ‌ర్ 14న రానా పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌చారంలో హుషారు పెంచేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ హంక్ స్టార్ రానా గురించి పిల్ గోవాంక‌ర్ సామాజిక మాధ్య‌మాల్లో హాథీ మేరా సాథీ పోస్ట‌ర్ ని షేర్ చేసి ఓ ఆస‌క్తిర సందేశాన్ని పోస్ట్ చేసింది.

సెట్ లో రానా స్టార్ కాదు. అత‌నో స్టూడెంట్. స్టార్ అనే భావం అత‌ని లో చాలా అరుదుగా క‌నిపిస్తుంది. సినిమా అంటే అంకిత భావంతో.. ఎంతో క‌మిట్ మెంట్ .. ఫ్యాష‌న్ తో ప‌నిచేస్తాడు. అలాంటి స్టార్ తో క‌ల‌సి తెర‌ను పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. వ్య‌క్తిగ‌తంగాను రానా మంచి మ‌న‌సున్న మారాజు`` అంటూ పొగిడేసింది. మిగ‌తా టీమ్ స‌భ్యులు అంతే ఫ్యాష‌నేట్ గా ప‌నిచేస్తున్నారని సంతోషం వ్య‌క్తం చేసింది. అలాగే ఒకే సారి మూడు భాష‌ల్లో సినిమా తెర‌కెక్క‌డం త‌న‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింద‌ని ఆనందంతో ఉబ్బిత‌బ్బింది. ఆ పోస్ట్ చూసిన రానా అమ్మ‌డి కి మీతో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంద‌ని రిప్లై ఇచ్చాడు.

అలాగే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం కేర‌ళ అడ‌వుల్లో జ‌రిగింది. కీల‌క‌మైన స‌న్నివేశాలు అన్నింటిని అక్క‌డే చిత్రీక‌రించిన‌ట్లు శ్రీయా పిల్ గోవాంక‌ర్ రివీల్ చేసింది. అన్న‌ట్లు పిల్ గోవాంక‌ర్ ప్ర‌ముఖ టీవీ న‌టులు స‌చిన్- సుప్రియ‌ల గారాల పుత్రిక అన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం నెట్ ఫ్లిక్స్ సిరీస్ హౌస్ అరెస్ట్ లోనూ ఈ అమ్మ‌డు న‌టిస్తోంది. న‌వంబ‌ర్ 15 నుంచి ఇది స్ట్రీమింగ్ లో ఉంది.