ఫోటో స్టోరి: గజరాజుతోనే పరిహాసమా?

Sun Feb 23 2020 19:00:01 GMT+0530 (IST)

Rana Aranya Movie Latest Poster

రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం `అరణ్య`. ప్రభు సోల్మన్ దర్శకుడు. ఏప్రిల్ 2న హిందీ- తమిళం- తెలుగు భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన రానా పోస్టర్లు.. టీజర్ కి చక్కని స్పందన లభించింది.తాజాగా కొత్త పోస్టర్ రిలీజైంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న తమిళ నటుడు విష్ణు విశాల్ ఏనుగు మీద విశ్రాంతి తీసుకొంటూ సంగీత వాయిద్యం వాయిస్తున్న ఫోటో ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. ఈ సినిమాలో ఏనుగులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అన్న సంగతి పోస్టర్లను బట్టి అర్థమవుతోంది. రానా- విష్ణు విశాల్ పాత్రలు పూర్తిగా అడవితో కనెక్టివిటీని కలిగి ఉండడం ఆసక్తికరం.

అడవిలో మృగాల్ని వేటాడే మనుషులకు దానిని వ్యతిరేకించే కథానాయకుడికి మధ్య వార్ నేపథ్యంలోని చిత్రమా ఇది? అన్నది త్వరలోనే తేలనుందట. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జట్ తో నిర్మిస్తోంది.