Begin typing your search above and press return to search.

బాబాయి అబ్బాయి సిరీస్ బాధ్యతలు అన్నగారికి!

By:  Tupaki Desk   |   23 Sep 2021 9:33 AM GMT
బాబాయి అబ్బాయి సిరీస్ బాధ్యతలు అన్నగారికి!
X
వెంకటేష్‌ మరియు రానాలు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందని ఖచ్చితంగా సురేష్ బాబు చెబుతూ వచ్చాడు. ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకు అయినా కూడా ఖచ్చితంగా వీరి కాంబో మూవీ వస్తుందని ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా వెబ్‌ సిరీస్ ప్రకటన వచ్చింది. 'రానా నాయుడు' అనే వెబ్‌ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ వారు తీసుకు రాబోతున్నట్లుగా తేలిపోయింది. రానా నాయుడు వెబ్‌ సిరీస్ కు సంబంధించిన ఒక ఫొటో కూడా తాజాగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది. మేము గతంలోనే ఈ వెబ్ సిరీస్ ఒక ఇంగ్లీష్‌ వెబ్‌ సిరీస్ కు రీమేక్ అని పేర్కొన్నాము. అదే రే డోనవన్ వెబ్‌ సిరీస్‌. సూపర్ సక్సెస్ అయిన ఆ వెబ్‌ సిరీస్ ను నెట్‌ ఫ్లిక్స్ వారు రానా మరియు వెంకటేష్‌ లతో రీమేక్‌ చేస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ వెబ్‌ సిరీస్ ఉంటుందనే నమ్మకం తాజాగా వెళ్లడయిన ఒక విషయం ద్వారా తెలుస్తోంది.

రానా మరియు వెంకటేష్‌ లు ఈ వెబ్‌ సిరీస్‌ లో చాలా పవర్‌ ఫుల్‌ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఈ వెబ్‌ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ వారు నిర్మిస్తున్నప్పటికి నిర్మాణ బాధ్యతలు పూర్తిగా సురేష్ బాబు చూసుకుంటున్నాడట. పెట్టుబడి వారిది.. మెయింటెన్స్ సురేష్‌ బాబుది అన్నమాట. వెబ్ సిరీస్ కు సంబంధించిన టెక్నీకల్‌ మరియు ప్రొడక్షన్‌ నటీ నటుల ఎంపిక అన్ని విషయాలు కూడా పూర్తిగా సురేష్‌ బాబు బాధ్యతగా నెట్ ఫ్లిక్స్ వారు అప్పగించారట. దాంతో సురేష్‌ బాబు తనదైన శైలిలో తన అనుభవంను రంగరించి తన తమ్ముడు మరియు తనయుడి కోసం ఒక మంచి వెబ్‌ సిరీస్ ను రెడీ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. వెబ్‌ సిరీస్ తో నెట్‌ ఫ్లిక్స్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యేలా ప్లాన్‌ చేస్తోంది. వెబ్‌ సిరీస్‌ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యిందట.

రానా నాయుడు టైటిల్ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ఇద్దరు కూడా కొత్తగా కనిపించబోతున్న ఈ వెబ్‌ సిరీస్ ను ఎప్పటికి స్ట్రీమింగ్‌ చేస్తారు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. రాబోయే రోజుల్లో దృశ్యం 2 మరియు ఎఫ్‌ 3 సినిమాలు విడుదలకు సిద్దంగా ఉంచిన వెంకటేష్ ఈ వెబ్‌ సిరీస్ తో పాటు మరి కొన్ని సినిమాలను కూడా చేస్తున్నాడు. మరో వైపు రానా విరాటపర్వం సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. మరో వైపు పవన్ తో కలిసి భీమ్లా నాయక్ అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఇంకా రెండు మూడు సినిమాలు కూడా రానా లైన్ లో పెట్టాడు. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ ఇద్దరు కొత్తగా ట్రై చేయాలనే ఉద్దేశ్యంతో వెబ్‌ సిరీస్ ను చేయడం... దాని నిర్మాణ బాధ్యతలను సురేష్ బాబు వంటి ఇండస్ట్రీ పెద్దన్న గారికి అప్పగించడం వల్ల అంచనాలు భారీగా పెరిగి పోతున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ వెబ్‌ సిరీస్ ఉంటుందా అనేది చూడాలి.