Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న శివగామి చిన్ననాటి ఫోటో.. భలే ఉందే!!

By:  Tupaki Desk   |   9 July 2020 3:30 PM GMT
వైరల్ అవుతున్న శివగామి చిన్ననాటి ఫోటో.. భలే ఉందే!!
X
సౌత్ ఇండియన్ సీనియర్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ. ఒకప్పుడు కథానాయికగా తన అందాలతో సినిలోకాన్ని ఒక ఊపు ఊపేసింది. దాదాపుగా సౌత్ ఇండియన్ హీరోలు అందరితోనూ నటించిన ఘనత ఆమె సొంతం. హీరోయిన్ గా చేసినంత కాలం రమ్యకృష్ణ అభిమానులకు ఆరాధ్య దేవతనే చెప్పాలి. అంతగా పాపులారిటీ తెచ్చుకుంది. అందమైన హావభావాలతో, అద్భుతమైన నటనతో సినీ అభిమానులను అలరిస్తూనే ఉంది. ఇప్పటికి ప్రేక్షకుల కళ్లముందు మెదులుతుంది అంటే ఆమె చేసిన పాత్రలే అటువంటి గుర్తింపును సంపాదించి పెట్టాయి. అయితే హీరోయిన్.. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది. అయితే రమ్యకృష్ణకు సెకండ్ లైఫ్ ఇచ్చింది అంటే బాహుబలి సినిమాలోని శివగామి పాత్రనే చెప్పాలి. ఒకవిధంగా చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అన్నంతగా ఆమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయింది ఆ సినిమా.

అయితే బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కొన్ని సినిమాలు చేసింది కానీ ఆ రేంజ్ పేరు రాలేదు. రమ్యకృష్ణ తెలుగే కాదు సౌత్ బాషలన్నింటికీ సుపరిచితురాలే. ఇక సోషల్ మీడియాలో అరుదుగా కనిపించే రమ్యకృష్ణ ఇటీవలే తన చిన్ననాటి ఫోటో ఒకటి చేసింది. ఆ ఫోటోలో రమ్యకృష్ణ తన క్లాసుమేట్స్ తో ఉంది. అయితే ప్రైమరీ స్కూల్ లెవెల్లో దిగిన ఫోటో అనుకుంటా.. అయితే ఆ ఫోటో షేర్ చేసి తనను గుర్తు పట్టండి అని కాప్షన్ పెట్టింది. అభిమానులు, నెటిజన్లు ఊరుకుంటారా.. అదిగో ఇదిగో అంటూ కామెంట్స్ చేశారు. ఆఖరికి రమ్యకృష్ణనే ఇదిగో అంటూ మార్క్ చేసి చూపించింది. ఇక ఆ ఫోటోలో రమ్యకృష్ణ రెండు పిలకలు వేసుకొని.. కళ్లద్దాలు పెట్టుకొని నిలబడింది. ఆ ఫోటో చూస్తూ అభిమానులు మురిసిపోతున్నారు. ఇక ప్రస్తుతం రమ్యకృష్ణ రంగమార్తాండ తో పాటు తమిళంలో పలు సినిమాలు చేస్తోంది.