శివగామి చీరపై అరేబియా గాలి దాడి!

Thu Aug 11 2022 15:18:13 GMT+0530 (IST)

Ramya Krishna in Saree

చీర..రవిక అందం గురించి మాటల్లో చెప్పడం సాధ్యపడదు. ఆ అందాన్ని వర్ణించడం కోసం కవులు దిగి రావాల్సిందే. చీర అందం..ఔన్నత్యం అంత గొప్పవి మరి. చీరలో ఉన్న సౌకర్యం మరే వస్ర్తంలో దొరకదంటారు మహిళా మణులు. కానీ అదే చీర ఒక్కోసారి వాతావరణం అనుకూలించకపోతే అంతే చికాకు పుట్టిస్తుందంటారు.తాజాగా అదే సన్నివేశాన్ని ఎదుర్కున్నారు నటి రమ్యకృష్ణ. ప్రస్తుతం ఆమె పూరి కనెక్స్ట్ టీమ్ తో కలిసి 'లైగర్' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా లైగర్ టీమ్ అంతా ఉత్తరాది రాష్ర్టాల్ని చుట్టేస్తుంది. తాజాగా ముంబై ఈవెంట్ కోసం రమ్యకృష్ణ కూడా హాజరయ్యారు. .జుహూ లోని  బీచ్ కి ఎదురుగా ఉన్న లగ్జరీయస్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమానికి విజయ్ ..అనన్య పాండేతో పాటు రమ్యకృష్ణ కూడా హాజరయ్యారు. సరిగ్గా ఫోటో సెషన్ టైమ్ లో బీచ్ నుంచి గాలి ఒక్కసారిగా నటీనటులపై దాడి చేసింది. అరేబీయా సముద్రం నుచి   వేగంగా బలమైన గాలి వీడయంతో అంతా ఇబ్బంది పడ్డారు. ఆ గాలి చూసి ఎక్కడకి ఎగిరిపోతారో? అన్న సందేహం రాకమానదు.

సరిగ్గా ఇక్కడే రమ్యకృష్ణని సారీ బాగా ఇబ్బంది పెట్టింది. చీర  కొంగు గాలికి భుజంపై సరిగ్గా నిలబడేది కాదు. నలువైవపులా గాలి వీయడంతో అటు ఇటూగా పడిపోయేది. దాన్ని సర్దుకోవడానికి రమ్యకృష్ణ ఇబ్బంది పడింది. మరోవైపు హెయిర్ కి ఎలాంటి రబ్బర్ బ్యాండ్ లేకుండా ఫ్రీగా వదిలేడయడంతో కురలన్నీ ముఖం మీద పడిపోయేవి.

ఓవైపు చీర కొంగు..మరోవైపు కురులు సర్దుకోవడానికి  రెండు చేతులు సరిపోలేదు. ఆ పక్కనే ఉన్నా? విజయ్ సేతుపతి..అనన్య పాండే కూడా గాలి బలంగా వీయడంతో  వాళ్లు ఇబ్బంది పడ్డారు.

దీంతో కాసేపటికి ఫోటో సెషన్ ముగించుకుని అక్కడ నుంచి హోటల్ గదిలోకి వెళ్లిపోయారు. 'లైగర్' లో రమ్యకృష్ణ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 'బాహుబలి' లో శివగామి పాత్ర తర్వాత  అంత పవర్ ఫుల్ మామ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.