చరణ్ 'గోల్డ్' స్పూన్ తో కాదు 'గోల్డ్' మనసు తో పుట్టాడు

Thu Jul 07 2022 15:00:00 GMT+0530 (IST)

Ramcharan taken with him to HYD satya in charan charter flight

రామ్ చరణ్ తేజ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన గత చిత్రాలతోనే తానేంటో ఋజువుచేసుకున్నారు. విమర్శలు గుప్పించిన వాళ్ళతోనే ప్రశంసలు అందుకున్నాడు. చరణ్ కి చిరంజీవి గారు ఒక స్థానం మాత్రమే ఇచ్చారు.కానీ స్థాయి మాత్రం చరణ్ యే సంపాదించుకున్నాడు. ఒక బాధ్యతను మోస్తూ బ్రతకడం అంతా ఈజీ కాదుఅటువంటిది సినీ పరిశ్రమలో శిఖరాలను అధిరోహించిన చిరంజీవి అనే బాధ్యతను మోయటం ఇంకా కష్టం. ఆ బాధ్యతను అలవోకగా మోస్తూ మెగా అభిమానులకు భరోసా అవుతున్నారు రామ్ చరణ్. కేవలం వెండితెరపైన మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్నారు రామ్ చరణ్.

గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతేఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి ఆసుపత్రి కి చెల్లించడానికి డబ్బుల్లేకపోతే సినీ నటుడు కాదంబరి కిరణ్ దర్శకుడు సుకుమార్ చొరవతో రాంచరణ్ ని అడిగి 2లక్షలు తీసుకుని "మనం సైతం" ద్వారా ఆ కార్యక్రమం పూర్తిచేసారు.

అవికాక సుకుమార్ తదితరుల వద్ద 120000/- పోగుచేసి చనిపోయినామె పాప పేరున FD చేయమని ఇవ్వడం జరిగింది. కొన్ని రోజులు తర్వాత నటుడు కాదంబరి కిరణ్ రామ్ చరణ్ కి ఎదురుపడితే "ఆపాప ఎలావుంది కాదంబరి గారూ? అని అడిగారు. అది రామ్ చరణ్ వ్యక్తిత్వానికి నిదర్శనం.

తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు మెగావారసుడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో #RC15 సినిమాను చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా అమృత్ సర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్ కి సంబంధించిన సన్నివేశాలు పూర్తయ్యి హైదరాబాద్ కి తిరిగి రావాల్సి ఉంది. #RC15 లో ఎన్నో సినిమాలతో సుపరిచితమైన కమెడియన్ సత్య నటిస్తున్నాడు. సత్య సన్నివేశాలు కూడా పూర్తయ్యి హైదరాబాద్ కి రావాల్సి ఉంది.

ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ సత్యను తన సొంత విమానంలో తనతో పాటు హైదరాబాద్ కి తీసుకుని వచ్చారు. ఎంతో స్టార్ డం సంపాదించిన మెగా వారసుడి మంచి మనసు ఇప్పుడు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కమెడియన్ సత్య మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని ఈ విషయం తెలుసుకున్న చరణ్ గతంలోనే రంగస్థలం సినిమాలో సత్య కి ఒక అవకాశం కల్పించాడు. ఇప్పుడు ఏకంగా తనతో ప్రయాణం చేసే అవకాశం కల్పించిన చరణ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. చరణ్ గోల్డ్ స్పూన్ తో పుట్టాడు అంటారు. కాదు చరణ్ గోల్డ్ మనసుతో పుట్టాడు.