Begin typing your search above and press return to search.

స‌ల్లూ భాయ్ తో ఆ హీరోయిన్ ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   9 July 2018 5:05 PM GMT
స‌ల్లూ భాయ్ తో ఆ హీరోయిన్ ఫ్యామిలీ
X
బాలీవుడ్ స‌ల్మాన్ ఖాన్ కెరీర్లో మైలురాయిగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో `ద‌బాంగ్` ఒక‌టి. ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో సీక్వెల్ లో కూడా స‌ల్లూ భాయ్ న‌టించాడు. తాజాగా, త‌న హిట్ మూవీ పేరుతో `ద‌బాంగ్ టూర్ రీలోడెడ్` పేరుతో ఓ కార్య‌క్ర‌మాన్ని స‌ల్లూ భాయ్ ప్రారంభించాడు. తాజాగా, కెన‌డాలో జ‌రిగిన ఆ కార్య‌క్రమానికి టాలీవుడ్ మాజీ బ్యూటీ రంభ...త‌న ఫ్యామిలీతో హాజ‌రై సంద‌డి చేసింది. త‌న భ‌ర్త‌, - కూతురితో క‌లిసి స‌ల్లూభాయ్ తో ఫొటోల‌కు పోజులిచ్చింది. త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో రంభ ఆ ఫొటోల‌ను షేర్ చేసింది. దీంతో, ఆ ఫొటోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. గ‌తంలో వీరిద్ద‌రూ క‌లిసి దిగిన ఫొటోల‌తో ....ప్ర‌స్తుత ఫొటోల‌ను కంపేర్ చేస్తూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

కొంతకాలంగా రంభ‌....సినిమాల‌కు దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. త‌న భ‌ర్త‌తో రంభ‌కు మ‌నస్ప‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని...వారిద్ద‌రు కొంత‌కాలంగా విడిగా ఉంటున్నార‌ని....మ‌ళ్లీ ఇపుడు క‌లిసి ఉండేందుకు లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నార‌ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. అయితే, ఆ రూమ‌ర్స్ కు చెక్ పెడుతూ....రంభ త‌న భ‌ర్త‌, కూతురితో కలిసి టొరొంటోలో స‌ల్మాన్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైంది. స‌ల్లూ భాయ్ తో త‌న ఫ్యామిలీ దిగిన ఫొటోల‌ను రంభ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో, ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. దీంతో, గ‌తంలోని ఫొటోల‌ను....ప్ర‌స్తుత ఫొటోల‌ను కంపేర్ చేస్తూ నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. గ‌తంలో ఈ హిట్ పెయిర్....20 ఏళ్ల క్రితం బంధ‌న్, జుడ్వాల‌తో పాటు ప‌లు చిత్రాల్లో క‌లిసి న‌టించారు. అప్ప‌టి నుంచి వారిద్ద‌రికి మధ్య స్నేహం ఉంది.