చరణ్ తో శిష్యుడు సినిమా..సుకుమార్ గర్వంగా!

Tue Nov 29 2022 10:52:36 GMT+0530 (India Standard Time)

RamCharan to Act in BuchiBabu Film

మెగా పవర్ స్టార్ తో రామ్ చరణ్ తో సినిమా ఛాన్స్ అంటే? దర్శకుడిగా తానెంత అనుభవం సంపాదించాలో చెప్పాల్సిన పనిలేదు. అంతకు ముందు స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేసి ఉండాలి. బ్లాక్ బస్టర్ అందుకుని ఉండాలి. స్టార్స్ మాత్రమే చేయగలిగే స్టోరీ కలెక్షన్ ఉండాలి. రైటింగ్ సహా టెక్నికల్ విభాగాల్లోనూ ఎంతో  అనుభవం ఉండాలి. అవన్నీచూసిన తర్వాతనే చరణ్ కాంపౌండ్ లో ఎంట్రీ ఉంటుంది.ఆపై  హీరోని మెప్పించగల్గితే ఛాన్స్ కన్పమ్ అవుతుంది. మరి వీటన్నింటి ముందు యువ మేకర్ ని బుచ్చిబాబుని  ఎలా సమతూకం వేయాలి? అంటే? అది చరణ్ కి మాత్రమే తెలుసు. అవును స్టార్ మేకర్ సుకుమార్ బుచ్చి బాబు దర్శకుడిగా ఒకే ఒక్క సినిమాకు పనిచేసాడు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ని 'ఉప్పెన' సినిమాతో హీరోగా లాంచ్ చేసి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పుడు ఏకంగా రెండవ సినిమా ఛాన్స్ మెగా పవర్ స్టార్ తోనే దక్కించుకున్నాడు. ఈ అవకాశాన్ని  ఏవిధంగా వర్ణించాలి? అంటే కేవలం బుచ్చిబాబు ప్రతిభను మాత్రమే చూసి ఇచ్చిన అవకాశమిది. అతను చరణ్ కి చెప్పిన కథని మెచ్చి..ఈ కథ లో నేనే నటించాలని అన్న స్వార్ధంతో చరణ్ అతన్ని లాక్ చేసి పెట్టారు. ప్రాజెక్ట్ లాక్ అయ్యే వరకూ ఈ విషయం ఎక్కడా గాసిప్ కూడా తెరపైకి రాలేదు.

మీడియాలో అస్సలు కనిపించలేదు. అంటే బుచ్చిబాబు..చరణ్ ఎంత గోప్యత వహించారు? అన్నది చెప్పొచ్చు. అదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చర్చలు విఫలమైన తర్వాత చరణ్‌ని లాక్ చేయడం అన్నది గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. దీన్ని బట్టి బుచ్చిబాబు మేధోతనాన్ని అంచనా వేయోచ్చు. అసాధారణమైన ప్రతిభావంతుడు కాబట్టే చరణ్ సింగిల్  సిట్టింగ్ లో కథ ఒకేచేసాడు.

అంతటి ట్యాలెంటెడ్ కాబట్టే గ్రేట్ సుకుమార్ కి ప్రియ శిష్యుడు అయ్యాడు. మరిప్పుడు సుకుమార్  రియాక్షన్ఏంటి? అంటే గురువుగా అతను ఎంత సంతోషిస్తున్నాడో మాటల్లో వర్ణంచలేం. తన  శిష్యుడు రెండవ సినిమాకే స్టార్ హీరోతో పనిచేస్తున్నాడు అంటే ఆ గురువు ఆనందానికి అవధులుంటాయా? గురువును మించిన శిష్యుడు అయిపోడు.

అయితే చరణ్ తో   బుచ్చిబాబు పనిచేయడం వెనుక సుకుమార్  కీలక పాత్రధారి అని చెప్పాలి. అతని సహకారం లేనిదే శిష్యుడు అంత దూరం ప్రయాణించలేడు. గురువు అడుగు జాడల్లోనే నడుస్తూ చరణ్ కల్పించిన ఈ అవకాశాన్ని గురు దక్షణగానే భావించాలి. మరో కాకినాడ కుర్రాడు పాన్ ఇండియా లో ఫేమస్ అవ్వడం తధ్యం. ఇప్పటికే 'పుష్ప' సినిమాతో సుకుమార్ దేశ వ్యాప్తంగా నీరాజనాలు అందుకున్న సంగతి తెలిసిందే.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.