బోయపాటి - రామ్.. థమన్ అదే రేటు!

Fri Oct 07 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Ram potheneni Boyapati upcoming movie thaman remuneration

మాస్ కమర్షియల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ సెట్ చేసుకున్న బోయపాటి శ్రీనివాస్ ఇప్పుడు రామ్ పోతినేనితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అఖండ లాంటి సక్సెస్ తరువాత బోయపాటికి అగ్ర హీరోల నుంచి ఆఫర్లు చాలానే వచ్చాయి. కానీ అతను మాత్రం ముందుగా ఇచ్చిన మాట ప్రకారం రామ్ తోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అఖండ సినిమా సక్సెస్ అయినా కాకపోయినా కూడా తప్పకుండా మనం సినిమా చేద్దామని రామ్ మాట ఇవ్వడంతో బోయపాటి ఫిదా అయ్యాడు.అందుకే ఇప్పుడు రామ్ కోసం పవర్ఫుల్ కథను కూడా సిద్ధం చేశాడు. మొత్తానికి నేడు సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. అయితే ఈ ప్రాజెక్టుకు తమన్ సంగీత అందించబోతున్నాడు. ఇదివరకే సరైనోడు సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్న ఈ కాంబినేషన్ అఖండతో కూడా అదే కంటిన్యూ చేసింది. ఇక ఇప్పుడు రామ్ తో కూడా మరో సక్సెస్ అందుకోవాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వారితోషికాలు కూడా గ్రాండ్ గానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా థమన్ అయితే దాదాపు మహేష్ బాబు 28వ సినిమాకు అందుకున్న రేంజ్ లోనే ఈ ప్రాజెక్టుకు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. తమన్ గత ఏడాది వరకు దాదాపు రెండు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న తర్వాత అఖండ సినిమా క్లిక్ కావడంతో రేటు మూడు కోట్లు దాటింది. ఇక త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాకు ఆ లెక్క ఐదుకు కూడా చేరినట్లు మరొక టాక్ వినిపిస్తోంది.

అయితే ఆడియో రైట్స్ ఆధారంగా లెక్క ఎక్కువైనా కావచ్చు. ఇప్పుడు రామ్ పోతినేని సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరపైకి రాబోతుంది. కాబట్టి ఆ లెక్క ఈజీగా ఐదు కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా కూడా థమన్ మాత్రం హై లెవెల్లో సినిమాలు చేస్తూ రెమ్యునరేషన్ విషయంలో కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కంటెంట్ నచ్చితే మాత్రం అప్పుడప్పుడు కాస్త తక్కువ స్థాయిలో కూడా రెమ్యునరేషన్ తీసుకోవడానికి ఈ సంగీత దర్శకుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.