ఎనర్జిటిక్ స్టార్ వారియర్ లుక్ అదిరింది

Mon Jan 17 2022 12:49:52 GMT+0530 (IST)

Ram oora mass look for The Warrior

హీరో రామ్ హై వోల్టేజ్ యాక్షన్ ఇంటెన్స్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. `ఇస్మార్ట్ శంకర్` రెడ్ వంటి హిట్ చిత్రాల తరువాత హీరో రామ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు ఎన్. లింగుసామితో ఓ మాస్ మసాలా హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాని చేస్తున్న విషయం తెలిసిందే. #RAPO19గా రానున్న ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సోమవారం రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించినట్టుగానే రివీల్ చేశారు. ఈ చిత్రానికి  `ది వారియర్` అనే టైటిల్ ని ఫైనల్ చేశారు.అంతే కాకుండా హీరో రామ్ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. ఇందులో హీరో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫసర్ గా ఇంటెన్స్ లుక్ తో మునుపెన్నడూ కనిపించని సరికొత్త మేకోవర్ తో కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఏపీ నేపథ్యంలో ఈ మూవీ ససాగుతున్నట్టుగా తెలుస్తోంది. చిత్రంలో రామ్ ఏపీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ ని బట్టి తెలుస్తోంది. తెలుగు తమిళ భాషల్లో ఏక కాలంలో ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో రామ్ కు జోడీగా కృతిశెట్టి నటిస్తోంది.

రామ్ తో పోటీపడే పవర్ ఫుల్ విలన్ గా యంగ్ హీరో ఆదిపినిశెట్టి కనిపించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన విశేషం ఏంటంటే ఉస్తాద్ రామ్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇంత వరకు ఎన్నో చిత్రాల్లో ప్రేమికుడిగా పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన రామ్ కెరీర్ లో తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఈ మూవీ రామ్ అభిమానులకు ఓ యాక్షన్ ట్రీట్ గా మారనుందని చెబుతున్నారు.  

గత కొంత కాలంగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు ఎన్.లింగుసామి ఈ మూవీ కోసం చాలా కేర్ తీసుకుంటున్నారట. ఎలాగైనా ఈ మూవీతో రెండు భాషల్లో ఒకేసారి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని తనపై గత కొంత కాలంగా వస్తున్న రూమర లకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారట. హీరో రామ్ కూడా ఈ మూవీతో తన స్థాయితో పాటు తన మార్కెట్ ని కూడా పెంచుకోవాలని భావిస్తున్నారట.

హీరో రామ్ కెరీర్ లోనూ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కన్నడ సోయగం అక్షర గౌడ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్రహణం అన్బు - అరివు ఫైట్స్ అందిస్తున్నారు. ఈ మూవీని తమిళ్ లో మాస్టర్ పీస్ ప్రొడక్షన్ కంపనీ రిలీజ్ చేస్తోం