అదే `గాడ్ ఫాదర్`ని దెబ్బతీసింది : రామ్ చరణ్

Tue Nov 29 2022 20:29:39 GMT+0530 (India Standard Time)

Ram charan comments on God father movie

మెగాస్టార్ నటించిన లేటెస్ట్ పొలిటిక్ యాక్షన్ థ్రిల్లర్ `గాడ్ ఫాదర్`. మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ మూవీని మలయాళ బ్లాక్ బస్టర్ `లూసీఫర్` ఆధారంగా రీమేక్ చేశారు. రీసెంట్ గా దీపావళికి విడుదలైన `గాడ్ ఫాదర్` ఫస్ట్ వీక్ సక్సెస్ టాక్ తో రన్నయినా ఆ తరువాత డల్ అయిపోయింది. `కాంతార` రావడంతో ఈ మూవీని పట్టించుకున్న వాళ్లే కరువయ్యారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రామ్ చరణ్ `గాడ్ ఫాదర్` వసూళ్లపై స్పందించాడు.మోహన్ లాల్ `లూసీఫర్` ఆధారంగా `గాడ్ ఫాదర్`ని రీమేక్ చేశాం. ఓటీటీలో ఈ మూవీని భారీ ఆదరణ లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 145 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని చరణ్ వెల్లడించాడు. రీమేక్ సినిమాల గురించి మాట్లాడుతూ `లూసీఫర్` ఆధారంగా నిర్మించిన సినిమా `గాడ్ ఫాదర్`. ఈ మూవీని ఓటీటీలో భారీ స్థాయిలో ప్రేక్షకులు వీక్షించారు. అయితే మాతృక అప్పటికే ఓటీటీలో రిలీజ్ కావడం.. అత్యధిక శాతం మంది వీక్షించడంతో చాలా వరకు ప్రేక్షకులు `గాడ్ ఫాదర్`ని చూడటానికి ఇష్టపడలేదు. అదే `గాడ్ ఫాదర్` ని దెబ్బతీసింది` అన్నారు.

 బహుశా స్టార్ చరిష్మా స్టార్ పవర్ కూడా రీమేక్ సినిమాల కోసం ప్రేక్షకులని థియేటర్లకు మళ్లీ రప్పించవచ్చు. కానీ ఆ ఫార్ములా ఎప్పుడూ వర్కవుట్ అవుతుందా? అంటే నేను మాత్రం కాదంటాను. నేను రీమేక్ లు చేస్తానో లేదో తెలియదు. అయితే నేను రీమేక్ లు చేస్తే గనక ముందు మాతృకని ఓటీటీలో రిలీజ్ చేయోద్దని ఓరిజినల్ నిర్మాతని రిక్వెస్ట్ చేస్తాను. అలా అయితేనే రీమేక్ చేస్తానని కండీషన్ పెడతాను. అలా జరగనప్పుడు అంతా ఒరిజినల్ కథలు చేయడమే మంచిది అన్నారు.

శంకర్ తో చేస్తున్న సినిమా గురించి మాట్లాడుతూ శంకర్ ని 1992 నుంచి చూస్తున్నాను. అతను మావిరిక్ ఫిల్మ్ మేకర్. తను దూరదృష్టి గల దర్శకుడు. మనకు తెలిసిన మొట్టమొదటి పాన్ ఇండియా డైరెక్టర్ అని రాజమౌళి అనగా విన్నాను. శంకర్ తో కలిసి పని చేసే అవకాశం రావడం అదృష్టం. ఈ సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శంకర్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయనతో కలిసి పని చేయడం అంటే మళ్లీ పాఠశాలకు వెళ్లడం లాంటిది. తను మంచి ఫిల్మ్ మేకరే కాదు.. మంచి మార్కెటింగ్ మేధావి కూడా. ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేయాలో తనకు తెలుసు. ఫ్యాన్స్ లాగే నేను కూడా ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్నాను.  

పాన్ ఇండియా గురించి మాట్లాడుతూ అందరూ టాలీవుడ్ కోలీవుడ్.. బాలీవుడ్ అని కాకుండా ఇండియన్ సినిమా ఇండియన్ యాక్టర్స్ అనాలి. వికీ పీడియాలో సెర్చ్ చేసినా సౌత్ తమిళ్ మలయాళం..బాలీవుడ్.. గుజరాతీ బెంగాలీ అని కాకుండా  రామ్ చరణ్ ఇండియన్ యాక్టర్ అని రావాలి. ఇకపై ఏ వుడ్ కి చెందిన వారైనా భారతీయ నటులుగా పిలవబడాలి.. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను` అన్నాడు రామ్ చరణ్.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.