రామ్ సేతు ఇంటెన్స్ లుక్ నెట్టింట వైరల్!

Mon Sep 26 2022 12:36:26 GMT+0530 (India Standard Time)

Ram Sethu's Intense look is going viral!

ఖిలాడీ అక్షయ్ కుమార్ 'ఆంట్రగిరే' తర్వాత సరైన సక్సెస్ పడలేదు. ఆపై నటించిన 'బచ్చన్ పాండే'..'సామ్రాట్ పృథ్వీరాజ్'..'రక్షాబంధన్' చిత్రాలు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా వాటిని అందుకోవడంలో విఫలమయ్యాయి. అక్షయ్ ఖాతాలో వరుసగా సినిమాలున్నా..ఫెయిల్యుర్స్ తప్ప సక్సెస్ లు కనిపించలేదు.ఈ నేపథ్యంలో అక్టోబర్ 25న  యాక్షన్ అడ్వెంచర్ 'రామ్ సేతు' ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి  తెలిసిందే.  జాక్వెలిన్ పెర్నాండేజ్.. నష్రత్ బరుచా..సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకి అన్ని వైపులా పాజిటివ్ బజ్ ని  తీసుకొస్తున్నాయి. తాజాగా సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.

పోస్టర్ ఆద్యంతం ఇంటెన్స్  మోడ్ ని  క్రియేట్ చేస్తుంది. సినిమాని ఓ విజువల్ వండర్ గానే తీర్చిదిద్దినట్లు పోస్టర్ రివీల్ చేస్తుంది. పంచభూతాల సాక్షిగా రామ్ పోరాటం ఆద్యంతం ఆసక్తికరమే అనిపిస్తుంది. పోస్టర్ లో అక్షయ్ కుమార్ ఆహార్యం కొత్తగా ఉంది. కళ్లద్దాలు..నెరిసిన గెడ్డం..హెయిర్ స్టైల్ అక్షయ్ ని కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాయి.

సముద్రం..భూమిని ఆధారం చేసుకుని నిర్మించిన 'రామ సేతు' బ్రిడ్జి కథని యాక్షన్ అడ్వెంచర్ గా ఆద్యంతం మలిచడానికి దర్శకుడు అభిషేక్ శర్మకి ఛాన్స్ ఉంది. ఈ బ్రిడ్జి కథకు ఎంతో చరిత్ర ఉంది. అంతటి చరిత్ర పుట్టల్లోకి  వెళ్లి తయారు చేసిన కథ ఇది. మరి మేకర్ ఎంత ఆసక్తికరంగా మలిచారు? అన్నది తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఇంకా సినిమా నుంచి మరిన్ని ప్రచార చిత్రాలు రిలీజ్ అయితే  క్లారిటీ వస్తుంది. ఈ సినిమాగాక అక్షయ్ కుమార్ 'సెల్పీ'..'ఓ మై  గాడ్'.. 'ఆకాశమే నీ హద్దురా'..'క్యాప్సుల్ గిల్'  చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోల్లో వేగంగా సినిమాలు చేస్తోన్న ఏకైక స్టార్ గా అక్షయ్ ని చెప్పొచ్చు.

ఏడాదికి కనీసం  రెండు సినిమాలైనా రిలీజ్ అయ్యేలా అక్షయ్  ప్లాన్ చేసుకుంటున్నారు.  అలాగే  అవకాశం వస్తే దక్షిణాది చిత్రాల్లో నూ నటిస్తున్నారు. ఇప్పటికే సౌత్ లో బాలీవుడ్ నుంచి బాగా ఫేమస్ అవుతోన్న నటుడిగా పేరు దక్కించుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.