మరో ఇస్మార్ట్ శంకర్ రావడం పక్కా

Mon Mar 01 2021 15:00:01 GMT+0530 (IST)

Ram Pothineni Talking About Ismart Shankar Sequel

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రామ్ మరియు పూరిలకు సక్సెస్ చాలా అవసరం అయిన సమయంలో ఇస్మార్ట్ శంకర్ వచ్చి వారి కెరీర్ కు బూస్టింగ్ ఇచ్చింది అనడంలో సందేహం లేదు. ఆ సినిమా వల్లే పూరి మళ్లీ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వంటి స్టార్ తో సినిమా ను చేస్తున్నాడు. ఇక రామ్ కూడా వరుసగా సినిమా లు చేస్తున్నాడు అంటే ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన బూస్టింగ్ వల్లే అనడంలో సందేహం లేదు. అలాంటి ఒక మంచి సినిమా ను చేసిన రామ్ పూరిల కాంబోలో మరో మూవీ వస్తుందని గతంలోనే అధికారిక ప్రకటన వచ్చింది. పూరి డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో రామ్ తో సీక్వెల్ చేస్తాను అని ప్రకటించాడు.రెండేళ్లు అయినా ఆ విషయమై ఎలాంటి అప్ డేట్ లేక పోవడంతో అసలు ఆ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పూరి కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ తో పూరి మూవీ ఉంటుంది. కాని దానికి కనీసం ఏడాది కాలం అయినా పడుతుందని అంటున్నారు. వచ్చే ఏడాదిలో వీరిద్దరి కాంబో సినిమా ఉంటుందని అంటున్నారు. పెద్ద ఎత్తున అంచనాల నడుమ 'లైగర్' సినిమా ను విజయ్ దేవరగకొండ తో పూరి తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత పూరి చేయబోతున్న సినిమా రామ్ తోనేనా లేదంటే మద్యలో మరేదైనా సినిమాను చేస్తాడా అనేది చూడాలి. మొత్తానికి అయితే రామ్ పూరిల కాంబో లో మరో ఇస్మార్ట్ శంకర్ రావడం అయితే పక్కా అంటూ సమాచారం అందుతోంది.