ఫోటో స్టోరి: అరే..! ఇతను మన RAPOయేనా?

Mon Sep 13 2021 15:45:10 GMT+0530 (IST)

Ram Pothineni Latest Pic

రామ్ అంటే చాక్లెట్ బోయ్ లా ఇస్మార్ట్ గా ఉండేవాడు. కానీ అది ఒకప్పుడు. మొన్న ఇస్మార్ట్ శంకర్ లో కూడా మాస్ కలగలిసిన రగ్ డ్ బోయ్ లా కనిపించాడు. తరవాత రెడ్ కోసం అతడు పూర్తిగా రూపం మార్చేందుకు ట్రై చేశాడు. జిమ్ లో కండలు పెంచాడు. కానీ ఇప్పుడు అసలు ఇతను మన `రాపో`యేనా? అంటూ ఆశ్చర్యపోయేలా మారాడు.శిల్పి ఉలి వేసి చెక్కినట్టు రాపో ఎంతగా మారిపోయాడంటే.. ఈ రూపం చూసి మీరే చెప్పొచ్చు. బాగా కండలు మెలి తిప్పాడు. శరీరాన్ని ధృఢంగా మార్చాడు. ఇకమీదట అతడు చొక్కా తొడిగితే చినిగిపోవడం గ్యారెంటీ. అసలు ఇస్మార్ట్ రామ్ ని ఇలా చూశాక అమ్మాయిలు ఊరుకుంటారా? అంటే డౌటే.

ప్రస్తుతం RAPO19 కోసం సిద్ధమవుతున్న రామ్ ఆదివారం జిమ్ లో తన మాన్ స్టర్ లుక్ ని రివీల్ చేశాడు. భారీగా వీ- షేప్ తో భుజం.. మెలితిరిగిన కండలు ప్రదర్శిస్తూ కనిపించాడు. అతడి బైసెప్ ట్రైసెప్ రూపం ఆద్యంతం ఆకర్షణీయంగా బలిష్ఠంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏ కండను ఎలా తిప్పాలో అలా తిప్పి కనిపించాడు. మొత్తానికి దీనికోసం అతడు నెలల కొద్దీ సమయాన్ని జిమ్ కే కేటాయించాడని అర్థమవుతోంది.  రామ్ తన వ్యాయామ సెషన్ నుండి ఒక ఫోటోను పంచుకుంటూ.. తన జిమ్ సమయం ఏమిటో వెల్లడించడానికి స్టిక్కర్‌ను ఉపయోగించాడు. ``ప్రశాంతంగా ఉండండి.. ఇది షోల్డర్ డే.. అని అతని ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో క్యాప్షన్ ఇచ్చాడు. అంటే షోల్డర్ కోసం ప్రత్యేకించి ఎక్సర్ సైజులు చేశాడన్నమాట. అతడి ఆబ్స్ కూడా ఫ్లాట్ గా మారాయని అర్థమవుతోంది.

రాపో19 .. ద్విభాషా చిత్రానికి లింగుసామి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళం- తెలుగులో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతి శెట్టి కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తదుపరి షెడ్యూల్ సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది.