జై చంద్రబాబు.. వర్మ పంచ్ అదిరిపోయింది

Thu Mar 21 2019 23:49:23 GMT+0530 (IST)

Ram Gopal Varma Satires on Chandrababu naidu Over Lakshmis NTR

ఎదుటివారిని తన మైండ్ గేమ్ తో ఆడుకోవడంలో చంద్రబాబుని మించినోళ్లు ఈ ప్రపంచంలో ఉండరు. అయితే తాడి తన్నేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు ఇంకోడు ఉంటాడని సామెత. ఆ సామెతను వందకు వంద శాతం నిజం చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో చంద్రబాబుకి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వర్మ దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఈ నెలాఖరుకి ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.లక్ష్మీస్ ఎన్టీఆర్ స్టోరీ మొత్తం మనకు తెలిసిందే. చంద్రబాబుకి పూర్తి వ్యతిరేకమైన సినిమా. ఈ సినిమా ఎఫెక్ట్ ఓటర్లపై పడితే.. అది అంతిమంగా ఎన్నికల రిజల్ట్ పై తేడా చూపిస్తుంది. దీంతో టీడీపీ అభిమానులు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టులో కేసులు కూడా వేశారు. అయితే.. ఆ కేసులు మొత్తాన్ని కోర్టు కొట్టేసింది. దీంతో.. మిగిలిన ప్రయత్నాల్లో సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ముందే కనిపెట్టిన వర్మ చంద్రబాబుని భలే తెలివిగా లాక్ చేశాడు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ పై ట్విట్టర్ లో స్పందించిన వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని..కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీలో అలాంటి వాటికి ఆస్కారం ఉండదని.. ఆయనే దగ్గరుండి సినిమా రిలీజ్ అయ్యేలా చూస్తారని కామెంట్ చేశాడు. చివర్లో  జై చంద్రబాబు అంటూ తన మార్క్ పంచ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ తో చంద్రబాబు లాక్ అయినట్లే. సినిమా ఆపితే ముఖ్యమంత్రిగా తాను ఏం చర్యలు తీసుకోనట్లు. రిలీజ్ చేస్తే పార్టీ పరువు - తన పరువు పోతుంది. దీంతో ఏం చెయ్యాలో తెలీక  అల్లాడిపోతున్నారు బాబుగారు. వర్మ మజాకానా.