Begin typing your search above and press return to search.

వీడియో: ఎవరి తాట తీస్తావు వర్మ

By:  Tupaki Desk   |   20 April 2019 8:11 AM GMT
వీడియో: ఎవరి తాట తీస్తావు వర్మ
X
ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ కథ ముగిసిపోయిందని గుర్తించిన వర్మ తన నెక్స్ట్ టార్గెట్ వైపు గురి పెట్టాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విడుదలయినా కాకపోయినా పెద్దగా ఒరిగేది ఏమి లేకపోవడంతో దాని మీద ఆశలు వదిలేసుకున్నట్టే కనిపిస్తోంది. మరోవైపు కేసీఆర్ బయోపిక్ ని ప్రకటించేసిన వర్మ అప్పుడే దాని తాలూకు హంగామా మొదలుపెట్టాడు.

ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజును పురస్కరించుకుని తానే వెరైటీగా పాడిన ఓ వీడియో సాంగ్ ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. నీ తాట తీయడానికి వస్తున్నా అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చిన తీరు ఆంధ్రుల నుంచి అవమానాలు పొందిన ఉదంతాలను అందులో ఉదహరించిన తీరు చూస్తుంటే ఈసారి కూడా వర్మ వివాదాలకు లోటు లేకుండా చూసుకునేలా ఉన్నాడు

ఇప్పుడు టైగర్ కెసిఆర్ పేరుతో రూపొందుతున్న ఈ బయోపిక్ లో చంద్రబాబునాయుడు మరియు ఆంధ్రా నాయకులతో పాటు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ లీడర్ల పాత్రలన్నీ ఉంటాయట . సినిమాలు ఎలా తీసినా ఆర్టిస్టుల సెలక్షన్ లో తనదంటూ ముద్ర చూపించే వర్మ ఇప్పుడు కూడా అదే చేస్తాడనే విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.

షూటింగ్ మొదలుపెట్టకుండానే తాట తీస్తా లాంటి వార్నింగ్ లు ఇవ్వడం చూస్తుంటే ఎప్పుడో విడుదలయ్యే టైగర్ కెసిఆర్ కు ఇప్పటి నుంచే గ్రౌండ్ సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అన్నట్టు కెసిఆర్ గా ఎవరు నటిస్తారో ఇంకా రివీల్ చేయలేదు వర్మ.ఎలాగూ వేగంగా షూటింగ్ పూర్తి చేస్తాడు కాబట్టి టైగర్ కెసిఆర్ ఈ ఏడాదే వచ్చినా ఆశ్చర్యం లేదు