ఫోటో స్టోరీ : ఊరిస్తున్న వర్మ

Tue Jan 22 2019 09:54:50 GMT+0530 (IST)

Ram Gopal Varma Lakshmis NTR

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను ప్రకటించి - వాటిని తెరకెక్కించకుండానే పక్కకు పెట్టేశాడు. నందమూరి తారక రామారావు బయోపిక్ ను తాను చేస్తానంటూ వర్మ ప్రకటించిన సమయంలో అసలు వర్మ ఆ ప్రాజెక్ట్ చేస్తాడా - వర్మ గతంలో ప్రకటించి వదిలేసిన సినిమాల మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా వదిలేస్తాడేమో అనుకున్నారు. కాని ఎన్టీఆర్ బయోపిక్ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని వర్మ చాలా సీరియస్ గా తీసుకున్నాడు. తాను అభిమానించిన ఎన్టీఆర్ చివరి అంకంను చూపించేందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ను చూపించబోతున్నాడట.ఈ చిత్రంపై అంచనాలు పెరిగేలా ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసిన వర్మ తాజాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఎలా ఉంటాడనే విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ గా నటించిన వ్యక్తి లుక్ కు మంచి రెప్పాన్స్ దక్కుతున్న నేపథ్యంలో మరిన్ని సినిమాకు సంబంధించిన లాంగ్ షాట్ స్టిల్స్ ను విడుదల చేశాడు. ఎన్టీఆర్ చిత్రంలో ఈ రెండు స్టిల్స్ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం కోసం వర్మ ఎంపిక చేసుకున్న నటీనటులు అంతా కూడా చాలా యాప్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు పాత్రతో పాటు లక్ష్మీ పార్వతి లుక్ ను కూడా విడుదల చేసిన వర్మ సినిమాపై అంచనాలు పెంచేశాడు. తాజాగా ఈ స్టిల్స్ ను విడుదల చేసిన వర్మ తన సినిమా అంచనాలను అందుకుంటుందని గట్టి నమ్మకంతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అతి త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేయబోతున్న వర్మ వచ్చే నెలలో సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.