పవర్ స్టార్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్...!

Sun Jul 05 2020 22:48:23 GMT+0530 (IST)

Ram Gopal Varma Gives Clarity on About His Power Star

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరినో ఒకరిని గిల్లుతూ వివాదాలు కొని తెచ్చుకుంటాడనే విషయం అందరికి తెలిసిందే. నిజానికి అలాంటి ట్రిక్స్ ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదని చెప్పవచ్చు. ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడటం దాన్ని వివాదాస్పదం చేయడం వర్మ నుంచే చూసి నేర్చుకోవాలి. ఇక సినిమాల విషయంలో కూడా ఆర్జీవీ శైలి కాంట్రవర్సీలు అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఇటీవల 'పవర్ స్టార్' అనే సినిమా అనౌన్స్ చేసి సంచలనం రేపాడు వర్మ. ఈ సినిమాలో పీకే ఎమ్మెస్ ఎన్ బీ టీఎస్ మరియు ఓ రష్యన్ మహిళ - నలుగురు పిల్లలు - ఎనిమిది గేదెలు మరియు ఆర్జీవీ నటించనున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ని పోలిన వ్యక్తిని హీరోగా పరిచయం చేసాడు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వర్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.''నా POWER STAR సినిమా ఏ వ్యక్తికో చెందిన బయోపిక్ కాదు. పార్టీ ప్రారంభించి ఎన్నికల్లో ఓడిపోయిన ఓ సినీ స్టార్.. అనంతర పరిణామాల గురించి కల్పిత కథతో ఈ సినిమా రూపుద్దికుంటోంది. ఏ వ్యక్తి జీవితాన్నైనా ఈ కథ పోలి ఉంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే'' అని ట్వీట్ చేసారు. అంతేకాకుండా 'పవర్ స్టార్' అనే సినిమా పవన్ కల్యాణ్ బయోపిక్ అంటూ మీడియాలో వస్తోన్న ఊహాగానాలు బాధ్యతారాహితం.. POWER STAR అనేది ఒక పార్టీని ప్రారంభించి ఎన్నికలలో ఓడిపోయిన ఒక టాప్ ఫిలిం యాక్టర్ కల్పిత కథ.. నిజ జీవితంలో దేనికైనా పోలిక ఉంటే అది యాదృచ్చికమే అంటూ మరో ట్వీట్ చేసి చెప్పిందే చెప్పారు వర్మ. ఇప్పటికే ఆర్జీవీపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్.. ఇప్పుడు ట్వీట్స్ ఆజ్యం పోసినట్లు ఉన్నాయి. దీంతో ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం మీరు సినిమా తీయండి మేం దాన్ని 100 రోజులు ఆడేలా చూస్తామంటూ కామెంట్స్ పెడుతున్నారు.