Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న ఎన్టీఆర్-వర్మల ఫోటో కాంబో!

By:  Tupaki Desk   |   20 May 2020 3:30 AM GMT
వైరల్ అవుతున్న ఎన్టీఆర్-వర్మల ఫోటో కాంబో!
X
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సర్ప్రైజ్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజుకు టీజర్ రాకపోయినా కూడా సర్‌ప్రైజులు వస్తాయని నమ్మకంతో ఉన్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ పర్సనల్ జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తానని ఇదివరకే మాటిచ్చాడు. చెప్పిన విధంగానే లాయిడ్ దిమ్మతిరిగే సర్‌ప్రైజ్ ఇచ్చేసాడు. ఇప్పటి వరకు చూడని ఎన్టీఆర్ పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్ చూపించాడు. ఇంతకుముందు టెంపర్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసిన తారక్ తర్వాత అరవింద సమెతలో కన్పించాడు. ఇప్పుడు ఇలా సర్ప్రైజ్ ఇవ్వడంతో ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు. ఇక ఇప్పుడు మరింత అదిరి పోయేలా అన్‌సీన్ స్టిల్ ఒకటి విడుదల చేసాడు లాయిడ్.

రామ్ గోపాల్ వర్మ అంటే తిక్కలోడు అని అందరికి తెలిసిందే.. ఎప్పుడెలా ఉంటాడో.. ఏం చేస్తాడో ఎవరికీ తెలీదు. వర్మ పొగిడితే తిట్టినట్లు తిడితే పొగిడినట్లు అన్పిస్తుంది. ఆయన మాటతీరు అలాగే ఉంటుంది. ఇండస్ట్రీలో ఎవ్వరిని వదలని వర్మ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌ పై పడ్డాడు. ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సిక్స్ ప్యాక్ ఫోటోపై తన మార్క్ కామెంట్ చేసాడు వర్మ. అందులో సిక్స్ ప్యాక్‌తో ఉన్న ఎన్టీఆర్‌ను ఏకంగా శృంగారతార మియా మాల్కోవాతో పోల్చేసాడు. ఇటీవలే మియాతో క్లైమాక్స్ అనే సినిమా తీసాడు. ఇంకా ఆమె మత్తులోనే ఉన్నట్లున్నాడు. అందుకే మియా మాల్కోవా తర్వాత తను చూసిన బెస్ట్ బాడీ ఎన్టీఆర్‌దే అంటూ ట్వీట్ చేసాడు. ఇది ప్రశంసా.. లేక సెటైరా? అని ఫ్యాన్స్ తికమక పడుతున్నారు. ఈ ఫోటో వైరల్ అవ్వడానికి ఆర్జీవీ కామెంట్ కూడా కారణం అనే చెప్పాలి. అంతలా నెట్టింట్లో వైరల్ అవుతోంది ఎన్టీఆర్-వర్మల కాంబో!