పవనిజాన్ని కెలికి `క్లైమాక్స్`కి ప్రచారమా ఆర్జీవీ?

Sat May 23 2020 09:30:14 GMT+0530 (IST)

Ram Gopal Varma Climax Teaser

ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషనే. వివాదాలతో  ప్రచారం కొట్టేయడం ఆయనకు హాబీ. దశాబ్ధాలుగా ఇదే పంథాలో వెళుతున్నారాయన. అందుకు మీడియా కూడా బాసటగా నిలుస్తోంది. ప్రస్తుతం జీఎస్టీ స్టార్ మియా మల్కోవాతో క్లైమాక్స్ అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కించి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు ఆర్జీవీ. ఇటీవలే టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసి యూత్ అటెన్షన్ మరోసారి తనవైపు తిప్పేసుకున్నాడు. హద్దులు మీరిన శృంగార భావనల ఉద్ధీపనగా ట్రైలర్ రక్తి కట్టించింది.ఇకపోతే ఆర్జీవీ ఇంత బిజీలోనూ జనసేనాని .. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఆలోచిస్తుండడం మరో ఇంట్రెస్టింగ్ టాస్క్. ఇంతకుముందు జనసేనాని రిలీజ్ చేసిన ఇజం పుస్తకం ఫ్యాన్స్ లోకి వైరల్ గా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ సిద్ధాంతాలు.. ఆలోచనలతో వచ్చిన పుస్తకం ఇది. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్పట్లో ఘాటుగానే స్పందించారు. అప్పట్లోనే పవన్ కు ఓ లేఖాస్త్రం సంధించారు. ఆ లేఖ మీడియాల్లోనూ హైలైట్ అయ్యింది.

లేటెస్టుగా మరోసారి ఆ లేఖను వర్మ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అయితే దీనిని పోస్ట్ చేసిన నిమిషాల్లోనే వరుసగా మియా మల్కోవా పోస్టర్లను రిలీజ్ చేసి `క్రైమాక్స్` సిరీస్ కి ప్రచారం చేసుకున్నాడు. అంటే పవన్ ని అడ్డుపెట్టుకుని ఆయన తన వెబ్ సిరీస్ ని ప్రమోట్ చేసుకుంటున్నాడన్న జిమ్మిక్ ఇట్టే అభిమానులకు అర్థమైపోయింది. మొత్తానికి ఆర్జీవీ తన పంథాను వీడడు కదా! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయనింతే.. మారడు అని అంతా సరిపుచ్చుకుంటున్నారు.