Begin typing your search above and press return to search.

ప్రేమికుల మధ్య సెక్స్‌ గురించి వర్మ భలే చెప్పాడు

By:  Tupaki Desk   |   8 Dec 2022 4:30 PM GMT
ప్రేమికుల మధ్య సెక్స్‌ గురించి వర్మ భలే చెప్పాడు
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తాజాగా అషురెడ్డితో చేసిన ఇంటర్వ్యూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా ఆమె కాళ్ల వద్ద కూర్చుని.. ఆమె కాళ్లకు ముద్దు పెడుతూ, తొడలను గురించి వర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ బలపడాలన్నా.. బలహీనపడాలన్నా కూడా సెక్స్‌ ప్రధాన కారణంగా నిలుస్తుందని వర్మ పేర్కొన్నాడు. అషురెడ్డితో ఇంటర్వ్యూలో ఈ విషయమై కాస్త డెప్త్‌ గానే తన వ్యూ ను చెప్పి అందరిని ఆశ్చర్యపర్చాడు. వర్మ చెప్పే అన్ని విషయాల మాదిరిగానే ఇది కూడా నిజమే కదా అనిపించేలా ఆయన థియరీ ఉంది.

వర్మ మాట్లాడుతూ.. ప్రేమికుల మధ్య సెక్స్ ఇచ్చినంత తృప్తి ప్రేమ ఇవ్వదు. కౌగిలింతలు.. ముద్దులు.. కబుర్లు చెబుతూ సెక్స్‌ కానిచ్చేస్తాడు. ఎప్పుడైతే సెక్స్‌ కానిచ్చేస్తాడో అప్పుడే వాడి యొక్క మోజు తీరుతుంది. అప్పటి నుండి అమ్మాయిని దూరం పెట్టడం మొదలు పెడతాడు.

అబ్బాయి నుండి మాటలు తగ్గి పోతాయి. అమ్మాయి మాత్రం అతడితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అతడి యొక్క మాటల కోసం పదే పదే చిరాకు పెట్టినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అతనికి మరింతగా కోపం వచ్చి దూరం అవుతారు. అలా ఇద్దరి మధ్య బ్రేకప్ అవుతుందని వర్మ పేర్కొన్నాడు.

ప్రేమికుల మధ్య సెక్స్‌ తర్వాతే బ్రేకప్ కు ఎక్కువ అవకాశం ఉంటుందని అభిప్రాయం ను వర్మ వ్యక్తం చేశాడు. వర్మ చెప్పింది నిజమే అన్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాస్త బోల్డ్ గా ఉన్నా కూడా నిజమే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.