Begin typing your search above and press return to search.

తార‌క్ తో చెర్రీ స్నేహం.. ఈ ర‌హ‌స్యం తెలుసా?

By:  Tupaki Desk   |   18 Jan 2020 4:06 AM GMT
తార‌క్ తో చెర్రీ స్నేహం.. ఈ ర‌హ‌స్యం తెలుసా?
X
2020 మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ ప్ర‌స్తుత‌ స‌న్నివేశ‌మేంటి? త‌న క్లోజ్ ఫ్రెండ్ తార‌క్ ఆన్ లొకేష‌న్ ఎలా ఉండేవాడు? అలాగే ఆలియాతో రొమాన్స్ సంగ‌తేమిటి? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌న్నిటికీ రామ్ చ‌ర‌ణ్ గంప‌గుత్త‌గా ఆన్స‌ర్ ఇచ్చేశారు. ఇప్ప‌టికే ఆర్.ఆర్.ఆర్ 70 శాతం పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఆ క్ర‌మంలోనే మీడియా చిట్ చాట్ లో చ‌ర‌ణ్ ర‌క‌ర‌కాల సంగ‌తులపై ఓపెన‌వుతున్నారు.

ముఖ్యంగా త‌న స్నేహితుడు ఎన్టీఆర్ గురించి చ‌ర‌ణ్ కాస్త ఉద్వేగంగానే స్పందించాడు. తార‌క్ తో స్నేహం కేవ‌లం ఆర్.ఆర్.ఆర్ వ‌ల్ల‌నే కుదిరింద‌ని అంతా అనుకుంటున్నార‌ని.. అయితే తామిద్దం చాలా కాలంగా స్నేహితుల‌మేన‌ని చ‌ర‌ణ్ తెలిపారు. జ‌క్క‌న్న వ‌ల్ల క‌లిసిన బంధం కానేకాద‌ని అంత‌కుముందు నుంచి స్నేహం ఉంద‌ని.. ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో అది మ‌రింత స్ట్రాంగ్ అయ్యింద‌ని తెలిపారు. ఆన్ ల‌కేష‌న్ ఒక ఫైర్ క్రాక‌ర్ లా తార‌క్ ప‌ని చేస్తాడ‌ని.. త‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌డం ఎంతో ఆనందాన్నిచ్చింద‌ని అన్నారు.ఆర్ ఆర్ ఆర్ సినిమా వ‌ల్ల‌ రెగ్యుల‌ర్ గా కొన్ని గంట‌ల‌పాటు క‌లిసి ఉండ‌టంతో త‌మ మ‌ధ్య అనుబంధం మ‌రింత ధృడ‌ప‌డింద‌ని చ‌ర‌ణ్ తెలిపాడు. ఉత్త‌రాంధ్ర‌లో అల్లూరి సీతారామ‌రాజు .. తెలంగాణ లో కొమ‌రం భీమ్ ఒకే విధంగా స్వాతంత్య్రం కోసం పోరాడారు. అలాంటి గొప్ప చ‌రిత్ర‌కారుల పాత్ర‌ల‌ను తాము పోషించ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని చ‌ర‌ణ్ అన్నారు.

ఇక తార‌క్ తో క‌లిసి న‌టించడం ఎంతో స‌ర‌దాగా ఉంటుంది. త‌ను సెట్స్ లో లేక‌పోతే నాకేదీ తోచ‌దు. అంత బాగా మా కంపెనీని ఎంజాయ్ చేస్తాం.. అని తెలిపారు. ఇక అలియాభ‌ట్ తో ఎంత వ‌రకూ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది? అన్న‌దానికి రెస్పాండ్ అవుతూ... ఇప్ప‌టివ‌ర‌కూ మా ఇద్ద‌రిపైనా ఎలాంటి స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌లేదని.. త్వ‌ర‌లోనే చేయ‌నున్నార‌ని చ‌ర‌ణ్‌ తెలిపాడు. చ‌ర‌ణ్‌- ఆలియా జంట‌పై చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌న్న వార్త‌ల్ని ఆయ‌న కొట్టి పారేశారు. ఆలియా ఈ చిత్రంలో సీత పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ‌రాజు విప్ల‌వంలో సీత పాత్ర ఎంత‌? అన్న‌ది తెర‌పై చూపించ‌నున్నార‌ట‌.