Begin typing your search above and press return to search.

అందరికి దిక్కైన రామ్ చరణ్ !

By:  Tupaki Desk   |   7 Feb 2023 3:00 PM GMT
అందరికి దిక్కైన రామ్ చరణ్ !
X
టాలీవుడ్ టాప్ హీరో రామ్ చరణ్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదేమిటంటే మెగా హీరో ఆయన రామ్ చరణ్ ఇప్పుడు అందరితో స్నేహపూర్వక సంబంధాలు నేర్పుతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ లో ఎలా అయితే సల్మాన్ ఖాన్ అందరు హీరోలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడో.. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారని అంటున్నారు. రామ్ చరణ్ కి టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలు అందరితో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.

రానా, శర్వానంద్, రామ్ చరణ్ చిన్ననాటి స్కూల్ మేట్స్ కావడంతో వారిద్దరితో మంచి రాపో రామ్ చరణ్ కి ఉంది. ఆ తర్వాత రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి . స్వయంగా బాబాయి కావడంతో వీరిద్దరూ అనేక సందర్భాలలో తమ బంధాన్ని మీడియా ముఖంగా కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే అల్లు అర్జున్ , వరుణ్ తేజ్ వంటి వారితో కూడా రామ్ చరణ్ కి మంచి సంబంధాలు ఉన్నాయి.

ఇక తాజాగా బాలకృష్ణ సైతం రామ్ చరణ్ తో రెండు సందర్భాలలో ఫోన్లో మాట్లాడడంతో బాలకృష్ణతో కూడా రామ్ చరణ్ మంచి స్నేహం ఏర్పడినట్లు అయింది. ఇక ప్రభాస్ కూడా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే రామ్ చరణ్ కి ఫోన్ చేయడం కూడా చర్చనీయాంసమైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కేవలం వారు మాత్రమే కాకుండా రామ్ చరణ్ ఇతర హీరోలతో కూడా చాలా స్నేహ సంబంధాలు నేర్పుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కూడా రామ్ చరణ్ కి ఉన్న స్నేహ సంబంధాలు పెరిగిపోయాయి.

అలా టాలీవుడ్ ఇండస్ట్రీలోని రామ్ చరణ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇన్ టాలీవుడ్ అన్నట్లుగా మారిపోయారు. ప్రస్తుతానికి రామ్ చరణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో ఆయన 15వ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉంది. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో 16వ సినిమా చేస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.