ఫోటో స్టోరీ: ఒకే ఫ్రేమ్ లో చిట్టిబాబు.. డార్లింగ్

Wed Sep 18 2019 22:53:12 GMT+0530 (IST)

 ఈ జనరేషన్ టాలీవుడ్ హీరోలు ఒకరితో ఒకరు ఎంతో ఫ్రెండ్లీ గా ఉంటారని అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం టాప్ లీగ్ స్టార్  లైన ప్రభాస్.. చరణ్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే వారెప్పుడూ తమ ఫ్రెండ్ షిప్ గురించి  బయటకు చెప్పుకోలేదు. అంతేకాదు.. వారు కలిసి ఉన్న ఫోటోలు పెద్దగా మీడియాలో కూడా బయటకు రాలేదు. అయితే తాజాగా వారిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటోలో చరణ్.. ప్రభాస్ లతో పాటుగా మరో వ్యక్తి కూడా ఉన్నారు. మరి ఏ సందర్భంలో వీరు కలిసి ఫోటో కు పోజ్ ఇచ్చారు అనేది తెలియరాలేదు. ఈ ఫోటోలో చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకు సంబంధించిన గెటప్ లో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇది లేటెస్ట్ పిక్ అనే విషయం మనకు అర్థం అవుతుంది. కొన్ని రోజుల క్రితం 'సైరా' హిందీ టీజర్ లాంచ్ ముంబైలో జరిగిన సమయంలో ప్రభాస్.. చరణ్ కలిసి ఒకే వేదిక పైన దర్శనమిచ్చారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో ఇదే కావడం విశేషం.

తెలుగు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు ఇలా కలిసిమెలిసి ఉండడం.. ఫ్రెండ్లీ రిలేషన్ ను మెయింటెయిన్ చెయ్యడం ఫ్యాన్స్ కు మంచి మెసేజ్ అందిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే  చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్ త్వరలో తన నెక్స్ట్ ఫిలిం 'జాన్' షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు.