సైరా కోసం చరణ్ క్లాస్!

Sun Sep 02 2018 15:14:57 GMT+0530 (IST)

Ram Charan Upset with Syeraa Movie

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న 152 సినిమా సైరా నరసింహారెడ్డి టీజర్ ని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఎప్పుడో వచ్చే వేసవిలో రిలీజయ్యే సైరాకు ఇంత త్వరగా టీజర్ అవసరం లేదు. కానీ నాన్న పుట్టిన రోజు కాబట్టి అభిమానులకు కానుక ఇచ్చే ఉద్దేశంతో చరణ్ ఇప్పటి దాకా షూట్ చేసిన ఫుటేజ్ లో నుంచే బెస్ట్ షాట్స్ కట్ చేయించి ఇది విడుదల చేయించాడు. అంతా బాగానే ఉంది కానీ మొదటి రోజే పది మిలియన్ వ్యూస్ మార్కుకు అతి దగ్గరగా వెళ్లిన సైరా టీజర్ విచిత్రంగా ట్రెండింగ్ లో మాత్రం లేకుండా పోయింది. మెగా ఫాన్స్ సైతం అయోమయానికి గురయ్యారు. ఐదారు మిలియన్లకే టాప్ ట్రెండింగ్ అంటూ పోస్టర్లు వేసుకునే పబ్లిసిటీ ట్రెండ్ లో ఇలా జరిగిందేమిటి అని అందరు షాక్ తిన్నారు. దీనికి కారణం ప్రత్యేకంగా ముంబై నుంచి డబ్బులిచ్చి పిలిపించిన డిజిటల్ టీమ్ నిర్వాహకమట.నిజానికి చిరు ఇమేజ్ కి ఫాలోయింగ్ కి పెయిడ్ ప్రమోషన్ అక్కర్లేదు. కానీ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేని చరణ్ ధృవ టైంలో వర్క్ అవుట్ చేసిన స్ట్రాటజీనే ఇక్కడా వాడదాం అనుకున్నాడు. కానీ ముంబై టీమ్ వేసిన ఏవేవో ప్లాన్స్ వల్ల యుట్యూబ్ హిట్స్ తక్కువగా రావడంతో చరణ్ కాస్త అప్ సెట్ అయ్యాడని మెగా కాంపౌండ్ టాక్. ఇవి నేరుగా షేర్ చేసుకునే విషయం కాదు కాబట్టి చరణ్ సైలెంట్ గా సదరు టీమ్ కి క్లాస్ పీకినట్టుగా తెలిసింది. బయట బాహుబలిని మించిన సినిమా అవుతుందని అంచనాలు ఉంటే ఇలా యుట్యూబ్ లో సైతం ట్రెండింగ్ చేయలేకపోవడం పట్ల సీరియస్ గానే చెప్పినట్టు సమాచారం. అవును మరి. రెండు వందల కోట్ల దాకా బడ్జెట్ పెట్టి నాన్న డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నప్పుడు ఈ మాత్రం జాగ్రత్తలు చాలా అవసరం. వచ్చే సమ్మర్ అన్నారు కానీ ఏ డేట్ అనే విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు సైరా టీమ్.