Begin typing your search above and press return to search.

కొన్ని రూమర్స్‌ వినడానికి చాలా బాగుంటాయి..ఇది అలాంటిదే!

By:  Tupaki Desk   |   8 April 2020 5:30 PM GMT
కొన్ని రూమర్స్‌ వినడానికి చాలా బాగుంటాయి..ఇది అలాంటిదే!
X
సినిమాల గురించి.. సినిమా స్టార్స్‌ గురించి పుకార్లు అనేవి చాలా కామన్‌ గా వస్తూనే ఉంటాయి. కొన్ని పుకార్లు చిరాకు తెప్పించేవిగా ఉంటే మరికొన్ని మాత్రం నిజంగా అలా జరిగితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న ఒక పుకారు నిజంగా జరిగితే బాగుండు కదా అని మెగా ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ 27వ చిత్రం విరూపాక్షలో రామ్‌ చరణ్‌ కీలకమైన గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు అనేది దాని సారాంశం.

పీరియాడిక్‌ డ్రామాగా రూపొందబోతున్న పవన్‌ కళ్యాణ్‌ 27వ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి అయ్యింది. ఈ కరోనా విపత్తు రాకుండా ఉంటే ఆ సినిమా షూటింగ్‌ తో పవన్‌ ఇంకా క్రిష్‌ బిజీగా ఉండేవారు. షూటింగ్‌ లేని ఈ సమయంలో బ్యాన్స్‌ ఉన్న ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ను పూర్తి చేస్తున్నారని అందులో భాగంగానే ఒక కీలకమైన గెస్ట్‌ పాత్రకు రామ్‌ చరణ్‌ ను క్రిష్‌ సంప్రదించాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

క్రిష్‌ దర్శకత్వంలో నటించాలని ఉంది అంటూ గతంలో ఒక ఆడియో వేడుక సందర్బంగా చరణ్‌ అన్నాడు. క్రిష్‌ పై ఉన్న అభిమానంతో అలాగే బాబాయి సినిమా అవ్వడంతో చరణ్‌ మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాడు అనేది ఆ పుకార్ల పూర్తి సారాంశం. ఈ వార్తలు మెగా ఫ్యాన్స్‌ కు కిక్కు ఇస్తున్నాయి. నిజంగా పవన్‌ సినిమాలో చరణ్‌ ఉంటే బాగుండు కదా అనుకుంటున్నారు. కాని ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదంటూ మెగా వర్గాల వారు అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ చరణ్‌ ల కాంబో కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు ఎప్పుడు బ్రేక్‌ పడేనో చూడాలి.