Begin typing your search above and press return to search.

కరోనా లేని భారత్ ని సాధిద్దాం..!

By:  Tupaki Desk   |   4 April 2020 12:30 PM GMT
కరోనా లేని భారత్ ని సాధిద్దాం..!
X
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడిగా స్టార్ డంని ఎంజాయ్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవలే అల్లూరి సీతారామరాజు లుక్ లో విడుదల చేసిన రాంచరణ్ ఇంట్రడక్షన్ విశేషంగా సినీ అభిమానులను ఆకట్టుకుంటుంది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఒక సందేశాన్ని బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 5న రాత్రి 9గంటల 9నిమిషాలకు దేశవ్యాప్తంగా ప్రతీ ఇంట్లో లైట్స్ ఆఫ్ చేసి కాండిల్స్ తో 9నిముషాల పాటు దీపాలు వెలిగించాలని ప్రధాని తెలిపాడు.

అయితే ప్రధాని సందేశానికి రాంచరణ్ స్పందిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఏప్రిల్ 5న రాత్రి 9గంటల 9నిముషాలకు దీపాలు వెలిగించి కరోనాను తరిమి కొట్టడడానికి - ప్రజలలో స్ఫూర్తి నింపడానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ట్విట్టర్ ద్వారా అభిమానులకు పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమం పై స్పందిస్తున్న మెగా హీరోలకు ప్రధానమంత్రి ఇప్పటికే ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఇక లాక్ డౌన్ అనంతరం రాంచరణ్ పూణేలోని ఆర్ ఆర్ ఆర్ షూటింగులో పాల్గొంటాడట. ఈ సినిమాలో రాంచరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.