Begin typing your search above and press return to search.

మెగా మ‌ల్టీస్టార‌ర్ లో చర‌ణ్ రోల్ ఇదే

By:  Tupaki Desk   |   9 Oct 2019 9:59 AM GMT
మెగా మ‌ల్టీస్టార‌ర్ లో చర‌ణ్ రోల్ ఇదే
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన 151వ సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి` ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. స్వాతంత్య్ర పోరాట యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌లో చిరంజీవి న‌టించారు. ఈ సినిమా గురించి అభిమానులు ముచ్చ‌ట్లాడుతుండ‌గానే.. మెగాస్టార్ 152వ సినిమాని లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ద‌స‌రా కానుక‌గా ఈ మంగ‌ళ‌వారం నాడు చిరంజీవి న‌టించే కొత్త సినిమా ప్రారంభ‌మైంది. కొర‌టాల శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే చ‌ర‌ణ్ పాత్ర ఎలా ఉయంటుంది అన్న‌దానిపై ఇప్ప‌టి వ‌ర‌కూ స‌రైన క్లూ రాలేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించే ఈ సినిమా ఓ సోషియో పొలిటిక‌ల్ క‌థాంశ‌మని తెలుస్తోంది. ఇందులో మెగాస్టార్ రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించేలా తొలుత కొర‌టాల క‌థను తీర్చిదిద్దారు. కానీ ఆ త‌ర్వాత‌నే ఐడియా మారింద‌ట‌. ఇందులో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తే బావుంటుంద‌ని మెగాస్టార్ కి త‌న అభిప్రాయం చెప్పార‌ట కొర‌టాల‌. అత‌డు ఇచ్చిన ఐడియా న‌చ్చి మెగాస్టార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో క‌థ‌లో అవ‌స‌రం మేర మార్పు చేర్పులు చేశారు.

రామ్ చ‌ర‌ణ్ ఇందులో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎంట‌ర‌వుతారు. అది చిరు గ‌తానికి సంబంధించిన ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్. అక్క‌డ‌ యువ‌కుడిగా ఉన్న‌ప్పుడు ఏం చేశాడు? అన్నది ఆ రోల్. దానికి రామ్ చ‌ర‌ణ్ అయితే బావుంటుంద‌ని కొర‌టాల ఒప్పించారు. మెగాబాస్ వెంట‌నే సై అనేశారు. ఇంట్రెస్టింగ్ క‌దూ.. ఈ న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లేందుకు కొర‌టాల స‌న్నాహాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ- మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.