Begin typing your search above and press return to search.

మెగా వ‌ర్సెస్ నంద‌మూరిపై చ‌ర‌ణ్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   23 Jan 2023 8:00 PM GMT
మెగా వ‌ర్సెస్ నంద‌మూరిపై చ‌ర‌ణ్ కామెంట్స్‌!
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి నంద‌మూరి హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించిన పాన్ ఇండియా వండ‌ర్ `RRR`. ద‌ర్శ‌కుడు ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ ఇద్ద‌రు లెజెండ‌రీ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ ఫిక్ష‌న‌ల్ స్టోరీగా రూపొంద‌డం..దీనికి ప్రేక్ష‌కులు ప్ర‌పంచ వ్యాప్తంగా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం తెలిసిందే. వ‌ర‌ల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించిన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌కు తిరుగులేని పాపులారిటీని తెచ్చిపెట్టింది.

అంతే కాకుండా ఈ సినిమా ప్ర‌తిష్టాత్మ‌క గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాల్లో RRR స‌త్తా చాటిన విష‌యం తెలిసిందే. . `నాటు నాటు` సాంగ్ కు గానూ బెస్ట్ ఒరిజిన‌ల్ మ్యూజిక్ విభాగంలో అవార్డుని ద‌క్కించుకుని ఇండియ‌న్ సినిమా స‌త్తా ఏంటో యావ‌త్ ప్ర‌పంచానికి చాటింది. అంతే కాకుండా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో `RRR` రెండు కేట‌గిరీల్లో అవార్డుల్ని దక్కించుకుని సంచ‌ల‌నం సృష్టించింది. బెస్ట్ మ్యూజిక్ కేట‌గిరితో పాటు బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ మూవీ కేటగిరీల్లో రెండు అవార్డుల్ని ద‌క్కించుకుంది.

హాలీవుడ్ స్టార్స్ అండ్ టెక్నీషియ‌న్స్ అత్యంత ప్ర‌తిష్టాత్కంగా భావించే ఆస్కార్ అవార్డుల‌కు `RRR` షార్ట్ లిస్ట్ చేయ‌బ‌డిన విష‌యం తెలిసిందే. ఆస్కార్ అవార్డుల‌కు సంబంధించిన ఓటీంగ్ పూర్తి కావ‌డం, యూఎస్ టుడే లో ఉత్త‌మ న‌టుటు కేట‌గిరీలో ఎన్టీఆర్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుండ‌టంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఆస్కార్ అవార్డుల‌పై ప‌డింది. మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో అవార్డుల వేడుక అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నుంది.

ఇక ఈ నెల 24న అంటే మ‌రి కొన్ని గంట‌ల్లో `RRR` ఆస్కార్ భ‌విత‌వ్యం తేల‌బోతోంది. ఈ మూవీతో మాలీవుడ్ వ‌ర్గాల‌ని సైతం ఆక‌ర్షించిన రామ్ చ‌ర‌ణ్ తాజాగా ఓ మాలీవుడ్ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా గ‌త 30 ఏళ్లుగా మెగా వ‌ర్సెస్ నంద‌మూరి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ తో త‌న‌కు ఆన్ స్క్రీన్‌, ఆఫ్ స్క్రీన్ వున్న పోటీని వివ‌రించారు. మెగా నంద‌మూరి ఫ్యామిలీల మ‌ధ్య గ‌త 30 ఏళ్లుగా పోటీ వుంది.

అయితే అది నంద‌మూరి తార‌క రామారావు కు నాన్న (చిరంజీవి)కు మ‌ధ్య‌ ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ అని స్ప‌ష్టం చేశాడు. ఎన్టీఆర్ తో క‌లిసి మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌ని వుంది` అంటూ క్లారిటీ ఇచ్చాడు. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ `RRR` చేస్తున్నార‌ని ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి సినిమా రిలీజ్ వ‌ర‌కు ఇద్ద‌రి అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. చ‌ర‌ణ్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఇప్ప‌టికైనా ఇద్ద‌రి అభిమానులు సోష‌ల్ మీడియా వార్ కు ఎండ్ కార్డ్ వేస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.