Begin typing your search above and press return to search.

చరణ్ క్లారిటీ ఇచ్చేనా...?

By:  Tupaki Desk   |   29 Sep 2020 7:31 AM GMT
చరణ్ క్లారిటీ ఇచ్చేనా...?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్'లో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో కనిపిస్తున్నాడు. దీంతో పాటు హోమ్ ప్రొడక్షన్ లో చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడింది. దీంతో ఆరున్నర నెలల పాటు చెర్రీ ఇంటికే పరిమితమైపోయాడు. అయితే కరోనా డేస్ లో హీరోలందరూ కొత్త స్క్రిప్ట్స్ వింటూ న్యూ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. ఒకరిద్దరు స్టార్ హీరోలైతే రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టారు. కానీ చరణ్ మాత్రం తన న్యూ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు.

కాగా, ఈ మధ్య స్టార్ హీరోలు అందరు వరుసపెట్టి సినిమాలు ఓకే చేస్తున్న తరుణంలో చరణ్ న్యూ ప్రాజెక్ట్ ఏంటని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చ‌ర‌ణ్ నెక్స్ట్ సినిమా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉండబోతోందనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొట్టింది. దీంతో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగాతో చరణ్ సినిమా ఉంటుందని మరో వార్త వచ్చింది. అదే సమయంలో సతీష్ అనే అప్ కమింగ్ డైరెక్టర్ చెప్పిన స్టోరీ లైన్ కి చరణ్ ఇంప్రెస్ అయ్యాడని రూమర్ పుట్టుకొచ్చింది. అలానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్నాడని మరో న్యూస్ సర్క్యూలేట్ అయింది. అయితే చరణ్ మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త అసంతృప్తికి గురవుతున్నారని తెలుస్తోంది. చరణ్ కూడా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ లైన్లో పెడుతూ టాప్ పొజిషన్ లో నిలబడాలని వారు కోరుకుంటున్నారు.