Begin typing your search above and press return to search.

నాన్న‌కు ప్రేమ‌తో చెర్రీ సాహ‌సం షాకింగే

By:  Tupaki Desk   |   26 Sep 2020 1:30 PM GMT
నాన్న‌కు ప్రేమ‌తో చెర్రీ సాహ‌సం షాకింగే
X
RRR తర్వాత రామ్ చరణ్ నటించబోయే సినిమా ఏదీ? అంటే.. ఎట్ట‌కేల‌కు ఫుల్ క్లారిటీ వ‌చ్చేసింది. డాడీ చిరంజీవితో క‌లిసి ఆచార్య‌లో చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. కొరటాల శివ ఈ సినిమాని చ‌క్క‌ని సోషియో పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో అవినీతి ఎలిమెంట్ ని ట‌చ్ చేస్తూ తెర‌కెక్కించ‌నున్నారు.

త్వ‌ర‌లోనే షెడ్యూల్ ని ప్రారంభించ‌నున్నారు. ఇక ఈ మూవీలో దాదాపు 40 నిమిషాల నిడివి ఉండే ఈ పాత్రలో చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్నారు. చిరు దేవాదాయ శాఖ అధికారిగా క‌నిపిస్తార‌ని చ‌ర‌ణ్‌ నక్సలైట్ గా క‌నిపించే వీలుంద‌ని ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఇక ఇందులో చరణ్ పోషించే ఈ పాత్ర సినిమాకే హైలైట్ కానుందట. ఇక చిరు చ‌ర‌ణ్ తండ్రి కొడుకులు గా క‌నిపిస్తారు అన్న‌దానికి కొర‌టాల అలాంటిదేమీ లేద‌ని ఇటీవ‌ల ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. చ‌ర‌ణ్ లుక్ గురించి ఓ కీల‌క విష‌యం బ‌య‌ట‌ప‌డింది. చ‌ర‌ణ్ ఇందులో కొంచెం ఫ్యాట్ బోయ్ గా క‌నిపిస్తార‌ట‌. నిజానికి అత‌డు ధృవ కోసం 6 ప్యాక్ తో అదిరే ట్రీటిచ్చారు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర కోసం మ‌రింత ధృఢ‌కాయుడ‌య్యారు. ఈ రెండిటికీ భిన్నంగా చ‌ర‌ణ్ ఫ్యాట్ లుక్ మెస్మ‌రైజ్ చేయ‌నుంద‌ట‌. అంటే రెండు డిఫ‌రెంట్ లుక్ ల‌తో రెండు వ‌ర‌స సినిమాల్లో ట్రీటిస్తార‌న్న‌మాట‌. ఇది నిజంగా మెగాభిమానుల‌కు బెస్ట్ విజువ‌ల్ ఫెస్ట్ అనే చెప్పాలి. నాన్న‌కు ప్రేమ‌తో చ‌ర‌ణ్ చేస్తున్న రిస్కులు అభిమానుల‌కు స‌మ్మ‌త‌మే.