చరణ్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడట

Mon Aug 03 2020 21:00:44 GMT+0530 (IST)

Setting up a Pan India project with Charan

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం కోసం రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు గత రెండేళ్లుగా మరే సినిమాలు చేయకుండా ఈ సినిమా కోసమే కష్టపడుతున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసేందుకు ఎన్టీఆర్ రెడీగా ఉన్నాడు. అయితే రామ్ చరణ్ మాత్రం ఇప్పటి వరకు తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. గౌతమ్ తిన్ననూరి నుండి కొరటాల శివ వరకు ఎంతో మందితో చరణ్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో దర్శకుడితో కూడా చరణ్ మూవీ గురించి ప్రచారం మొదయ్యింది.అర్జున్ రెడ్డి వంటి విభిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సందీప్ రెడ్డి తో చరణ్ సినిమా చేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో ఒక సినిమాకు కమిట్ అయిన సందీప్ రెడ్డి వచ్చే ఏడాది ద్వితీయార్థంలో చరణ్ తో సినిమాను మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. సందీప్ రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో చరణ్ వెంటనే ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

సందీప్ రెడ్డి గతంలో మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. మరి ఆ కథతోనే చరణ్ తో సినిమాను చేస్తున్నాడా లేదంటే మరేదైనా కొత్త కథతో సినిమాను చేయబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. చరణ్ కోసం పాన్ ఇండియా సబ్జెక్ట్ ను సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ డంను దక్కించుకున్న చరణ్ తో మళ్లీ స్థాయి సినిమానే చేయాలనే ఉద్దేశ్యంతో సందీప్ రెడ్డి పాన్ ఇండియా సబ్జెక్ట్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. వీరి కాంబోకు సంబంధించిన ఈ ఏడాది చివరి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.